
- అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్
నిజామాబాద్, వెలుగు: అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ సాయాన్ని పెంచాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు. శనివారం తన క్యాంప్ ఆఫీస్లో 49 మందికి రూ.11.95 లక్షల విలువ చేసే సీఎం రిలీఫ్ ఫండ్స్ ప్రొసీడింగ్స్ అందించి మాట్లాడారు. బాధితులు తన వద్దకు వచ్చిన వెంటనే స్పందిస్తున్నానని, అయితే వారు వైద్యానికి ఖర్చుచేసిన డబ్బులో గరిష్ఠంగా 20 శాతమే సాయం అందుతుందన్నారు.