
నిజాంసాగర్, (ఎల్లారెడ్డి ) వెలుగు : నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఆదివారం సాయంత్రం 49,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుందని ప్రాజెక్ట్ ఏఈ సాకేత్, అక్షయ్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 17.802 టీఎంసీలకు గాను ప్రస్తుతం 13.000 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. సోమవారం ప్రాజెక్టు గేట్లు ఎత్తి మంజీరా నదిలోకి వదులుతామన్నారు. నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. జాలర్లు, మేకల కాపర్లు నది పరీవాహక ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించారు.