మెడికల్ వీసాతో వచ్చి సిటీలో డ్రగ్స్ దందా .. నైజీయన్ ను పట్టుకొని డిపోర్ట్ చేసిన పోలీసులు

మెడికల్ వీసాతో వచ్చి సిటీలో డ్రగ్స్ దందా .. నైజీయన్ ను పట్టుకొని డిపోర్ట్ చేసిన పోలీసులు

హైదరాబాద్​ సిటీ, వెలుగు: పదేండ్ల కింద ఇండియాకు మెడికల్​వీసాపై వచ్చి, గడువు ముగిసినా హైదరాబాద్​లో ఉంటూ డ్రగ్స్​ దందా చేస్తున్న నైజీరియన్​ను పట్టుకొని డిపోర్ట్​ చేసినట్టు హెచ్​న్యూ డీసీపీ సుదీంద్ర గురువారం తెలిపారు. నైజీరియాకు చెందిన ఒనురా సోలమన్ 2014లో మెడికల్ వీసాపై ఇండియా వచ్చాడు. అతని వీసా 2014 సెప్టెంబర్ 23న, పాస్‌పోర్ట్ 2016 జనవరి 16న గడువు ముగిసింది. అయినప్పటికీ అతను చట్టవిరుద్ధంగా అత్తాపూర్​లో  ఉంటూ డ్రగ్స్​ వ్యాపారం చేస్తున్నాడు.

  పూణే , ముంబై  నుంచి గంజాయి, డ్రగ్స్​ తెచ్చి  సిటీలో ఎక్కువ ధరలకు అమ్ముతున్నాడు. ఇటీవల అతను టోలిచౌకి పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పదంగా తిరుగుతూ  ఉండగా.. హెచ్​న్యూ పోలీసులు అతన్ని పట్టుకొని  అరెస్టు చేశారు.  విచారణలో  అతను సరైన డాక్యుమెంట్లు  చూపించలేదు. పైగా వీసా, పాస్‌పోర్ట్ గడువు ముగిసినట్లు అంగీకరించాడు .దీంతో పోలీసులు అతడిని  అక్టోబర్ 9 ఉదయం నైజీరియాకు డిపోర్ట్​ చేశారు.