
సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు దరఖాస్తుల స్వీకరణ
హైదరాబాద్, వెలుగు: ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (ఎఫ్ఎంజీఈ) స్క్రీనింగ్ టెస్ట్‌కు సంబంధించిన ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. సెప్టెంబర్1న ఉదయం10 గంటల నుంచి సెప్టెంబర్ 30 ఉదయం11 గంటల వరకు ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్ఎంసీ తెలిపింది. అభ్యర్థులు https://www.nmc.org.in/ActivitiWebClient/open/studentregistrationHome వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది.
ఎలిజిబిలిటీ స్టేటస్, ఇతర సమాచారం కోసం అభ్యర్ధులు eligibility@nmc.org.in కు మెయిల్ చేయవచ్చని సూచించింది. దరఖాస్తు చేసుకున్న తర్వాత ఫైల్ ట్రాకింగ్ నంబర్ ను తప్పనిసరిగా సేవ్ చేసుకోవాలని ఎన్ఎంసీ సూచన చేసింది.