విమానంలో ఏసీ లేదు.. చెమట తుడుచుకోవడానికి ప్రయాణికులకు టిష్యూలు

విమానంలో ఏసీ లేదు.. చెమట తుడుచుకోవడానికి ప్రయాణికులకు టిష్యూలు

ఇండిగో సిబ్బందిపై పంజాబ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్ ఫైరయ్యారు.  చండీగఢ్ నుండి జైపూర్‌కు వెళ్లే విమానంలో ఏసీ లేకపోవడంతో ప్రయాణికులు చాలా ఇబ్బంది పడ్డారని, ప్రయాణికులు   చెమట తుడుచుకోవడానికి టిష్యూలు ఇచ్చారని ఓ  వీడియోను షేర్ చేశారు.  విమానంలోని ప్రయాణికులకు 90 నిమిషాలు పాటు చుక్కలు చూశారన్నారు. దీనిపై ఏ ఒక్కరు కూడా ఫిర్యాదు చేయలేదన్నారు. 

 ప్రయాణీకులను ముందుగా  మండే ఎండలో సుమారు 10-15 నిమిషాలు క్యూలో వేచి ఉండేలా చేశారని, ఆపై ఏసీలు ఆన్ చేయకుండానే విమానం బయలుదేరిందని అన్నారు. ఎయిర్ హోస్టెస్ ప్రయాణికుల చెమటను తుడవడానికి ఉదారంగా' టిష్యూ పేపర్లను పంపిణీ చేసిందని ఆయన ట్వీట్ చేశారు.  డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ), ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఎఐ)లను ట్యాగ్ చేసి, విమానయాన సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయనకోరారు. 

ఇండిగో విమానాల్లో ఒక్కరోజులో సాంకేతిక లోపం తలెత్తడం ఇది మూడోసారి . ఢిల్లీకి వెళ్తున్న ఇండిగో విమానం ఇంజిన్‌లో ఒకటి పనిచేయకపోవడంతో పాట్నా విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయవలసి వచ్చింది. విమానం బయలుదేరిన మూడు నిమిషాలకే ఈ ఘటన చోటుచేసుకుంది. 

పాట్నాలోని జై ప్రకాష్ నారాయణ్ విమానాశ్రయంలో ఉదయం 9:11 గంటలకు విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. మరో సంఘటనలో, రాంచీకి బయలుదేరిన ఇండిగో విమానం సాంకేతిక లోపం కారణంగా టేకాఫ్ అయిన గంటలోపు ఢిల్లీ విమానాశ్రయానికి తిరిగి వచ్చింది.