పీకే విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు

పీకే విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు

ప్రశాంత్ కిషోర్ విషయంలో కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. పీకేపై అనుమానాలు రావడం సహజమే అయినా.. ఆయన విషయంలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని చెప్పారు. సీఎం కేసీఆర్, సోనియా గాంధీలతో పీకే  సమావేశమవడంపై స్పందించడం తమ పరిధిలోని అంశం కాదని అన్నారు. సోనియా, రాహుల్ గాంధీలు ప్రజల మేలు కోరి పనిచేస్తారని జగ్గారెడ్డి చెప్పారు. పాలన విషయంలో కేసీఆర్ ఫెయిల్ అయ్యారన్న ఆయన.. కాంగ్రెస్ ప్రజల పక్షాన కొట్లాడుతుందని అన్నారు. ప్రజల అకౌంట్లలో వేస్తామన్న రూ.15లక్షలు ఏమయ్యాయని జగ్గారెడ్డి బీజేపీని ప్రశ్నించారు. లా అండ్ ఆర్డర్ విషయంలో కేసీఆర్ ఘోరంగా విఫలమయ్యారని అన్నారు.  బీజేపీ, టీఆర్ఎస్ వైఫల్యాలపై ఆ రెండు పార్టీలను నిలదీస్తామని జగ్గారెడ్డి చెప్పారు.