వ్యాక్సిన్ వేసుకున్నతర్వాత ఎవరూ చనిపోలేదు

వ్యాక్సిన్ వేసుకున్నతర్వాత ఎవరూ చనిపోలేదు

కరోనా వైరస్‌ ను అరికట్టేందుకు తయారు చేసిన వ్యాక్సిన్లు సత్ఫలితాలు ఇస్తున్నాయని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (AIIMS) తెలిపింది. వ్యాక్సిన్‌ వేసుకున్నవారు కరోనా వైరస్‌ బారినపడినా ఎవరూ మరణించలేదని చెప్పింది. దీనికి సంబంధించి తాము చేసిన రిపోర్టును ఎయిమ్స్ శుక్రవారం విడుదల చేసింది. మొత్తం 63 మందిని ఢిల్లీలో పరీక్షించగా వారు ఆరోగ్యంగా ఉన్నారని చెప్పింది.

వ్యాక్సిన్‌ సోకిన తర్వాత కరోనా సోకితే దానిని బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్‌గా పిలుస్తున్నట్లు ఎయిమ్స్ తెలిపింది. వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో లోడ్‌ అధికంగా ఉందని గుర్తించామన్నామంది. అయితే దానివల్ల ఎలాంటి ప్రమాదం.. ప్రాణనష్టం జరగలేదని అధ్యయనంలో ఎయిమ్స్‌ స్పష్టం చేసింది.