
బీజేపీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ సునీల్ బన్సల్ అన్నారు. హైదరాబాద్ బల్కంపేట్లో ఏర్పాటు చేసిన శక్తి కేంద్రం సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. ప్రతి బస్తీలోనీ ప్రతి వ్యక్తి సమస్యలను తెలుసుకునేందుకు నరేంద్ర మోడీ శక్తి కేంద్రాలను ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్రంలో 17వేల శక్తి కేంద్రాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శక్తి కేంద్రాల్లో మోడీ చేసిన మంచి పనులు, ప్రవేశపెట్టిన పథకాలు వల్ల ప్రజలు పొందిన లాభాలను తెలియజేస్తారని వివరించారు. మోడీ ప్రభుత్వంలో అవినీతి అనేది ఉండదన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ గెలవడం ఖాయమన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రజాసమస్యల పరిష్కారంతో పాటు అవినీతి నిర్మూలన చేస్తామని స్పష్టం చేశారు.