డ్రగ్స్ వద్దు.. లక్ష్యాన్ని పెట్టుకోండి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

డ్రగ్స్ వద్దు.. లక్ష్యాన్ని పెట్టుకోండి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
  • గాంధీ మెడికల్ కాలేజీలో డ్రగ్స్పై అవగాహన

పద్మారావునగర్, వెలుగు: యువత డ్రగ్స్​కు దూరంగా ఉండి, ఒక లక్ష్యాన్ని పెట్టుకొని, దాన్ని సాధించేందుకు కృషి చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచించారు. గాంధీ మెడికల్ కాలేజీలోని స్వామి వివేకానంద ఆడిటోరియంలో మంగళవారం నషా ముక్త్ భారత్ అభియాన్ 5వ వార్షికోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. మత్తు రహిత తెలంగాణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

ఇప్పటివరకు15,891 విద్యాసంస్థల్లో జరిగిన 7,018 అవగాహన కార్యక్రమాల ద్వారా 1.45 కోట్ల మందికి మత్తు దుష్ప్రభావాలపై అవగాహన కల్పించామని తెలిపారు. అనంతరం మెడికోలతో ప్రతిజ్ఞ చేయించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, టీజీ ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య, కలెక్టర్ హరిచందన దాసరి, గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ వాణి, ప్రిన్సిపాల్ ఇందిర, ఎస్పీ సీతారాం తదితరులు పాల్గొన్నారు.

ప్రిస్క్రిప్షన్​ లేకుండా మందులు కొనొద్దు
డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు కొనొద్దని పలువురు వైద్య నిపుణులు సూచించారు. వరల్డ్ యాంటీ మైక్రోబియల్​ రెసిస్టెన్స్​అవేర్​నెస్​వీక్​లో భాగంగా మంగళవారం సికింద్రాబాద్ లోని గాంధీ మెడికల్ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. 

ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందిర, సూపరింటెండెంట్ డాక్టర్​ వాణి  మాట్లాడుతూ.. డాక్టర్లను సంప్రదించకుండా మెడిసిన్స్ కావాలని వచ్చే పేషెంట్లకు ఫార్మసిస్టులు మందులు ఇవ్వొద్దని సూచించారు. అనంతరం డాక్టర్లు, విద్యార్థులతో కలిసి ర్యాలీ చేపట్టారు. కళాశాల మైక్రో బయాలజీ విభాగం హెచ్ వోడీ డాక్టర్ సురేఖ, ఆర్​ఎంవో బ్రహ్మేశ్వర్ ఉన్నారు.