టీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీసీ షార్ట్ ఫిలిం అవార్డ్స్ కు ఎంట్రీ ఫీజు లేదు...

టీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీసీ షార్ట్ ఫిలిం అవార్డ్స్ కు ఎంట్రీ ఫీజు లేదు...

తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని  ‘టీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీసీ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ – 2026’ను టీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీసీ  ఛైర్మన్  డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆయన మాట్లాడుతూ ‘ఈ ఫెస్టివల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాల్గొనేందుకు ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదు. 5 నుంచి 25 నిమిషాల నిడివి గల షార్ట్ ఫిలింలను  దర్శకులు, నటీనటులు, సాంకేతిక నిపుణులు పంపవచ్చు. 

ఎంట్రీలను జూన్ 13వ తేదీ వరకు స్వీకరిస్తారు. జ్యూరీ ఎంపిక చేసిన విజేతలకు జూన్ 21న హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అవార్డులు ప్రదానం చేయనున్నాం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో  టీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీసీ వైస్ ఛైర్మన్ గురురాజ్, టీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అక్సాఖాన్ తదితరులు పాల్గొన్నారు.