BCCI ఆర్టీఐ పరిధిలోకి రాదు.. కేంద్ర సమాచార కమిషన్ కీలక తీర్పు

BCCI ఆర్టీఐ పరిధిలోకి రాదు.. కేంద్ర సమాచార కమిషన్ కీలక తీర్పు

ముంబై: జాతీయ, అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్‌ల కోసం భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి, ఆటగాళ్లను ఎంపిక చేయడానికి బీసీసీఐకి ఉన్న నిబంధనలు, అధికారాలకు సంబంధించిన వివరాలను కోరుతూ దాఖలైన అప్పీల్‌ను కేంద్ర సమాచార కమిషన్ (CIC) (సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్) కొట్టివేసింది. సమాచార కమిషనర్ పి.ఆర్. రమేష్ తన ఉత్తర్వులో కొన్ని కీలక విషయాలను ఈ తీర్పు సందర్భంగా ప్రస్తావించారు.

బీసీసీఐ అనేది తమిళనాడు సొసైటీస్ రిజిస్ట్రేషన్ చట్టం కింద నమోదైన ఒక ప్రైవేట్ స్వయంప్రతిపత్తి సంస్థ అని, ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 2(h) ప్రకారం అది ప్రభుత్వ అధికార సంస్థ పరిధిలోకి రాదని పేర్కొన్నారు. బీసీసీఐకి భారీ ఊరట కల్పిస్తూ RTI పరిధిలోకి బీసీసీఐ రాదని CIC ప్రకటించింది. BCCI పబ్లిక్ అథారిటీ కిందకు రాదని, RTI చట్టం-2005 కింద సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని CIC స్పష్టం చేసింది.

BCCI ఒక స్వతంత్ర సంస్థ- అని, రాజ్యాంగబద్ధమైనది కాదని కమిషన్ వివరించింది. ప్రభుత్వం నుంచి BCCI నిధులు తీసుకోవడం లేదని -CIC ప్రకటించడం గమనార్హం. బీసీసీఐ ప్రపంచంలోనే అతిపెద్ద.. అత్యంత ధనికి క్రికెట్ బోర్డు. స్వాతంత్ర్యానికి పూర్వం 1928 లో ఏర్పడిన బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI).. ఇప్పటి వరకు ఇండిపెండెంట్ బాడీగా.. అటానమస్ (స్వయం ప్రతిపత్తి) హోదా అనుభవిస్తూ వస్తోంది. అంటే ప్రభుత్వ జోక్యం లేకుండా స్వయంగా నిర్ణయాలు తీసుకోవడం.. స్వయంగా పరిపాలించుకోవడం ఈ సంస్థకు ఉన్న ప్రత్యేక అధికారం. BCCI ఫండింగ్ విషయంలో ప్రభుత్వంపై ఆధారపడకుండా స్వీయ నిర్వహణలో ఉంది.

►ALSO READ | Sreeleela: తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ రూమర్స్.. నటి తల్లి స్వర్ణలత రియాక్షన్ వైరల్

BCCI అనేది దాని స్వంత నియమ నిబంధనలతో నడిచే స్వయంప్రతిపత్తి కలిగిన ప్రైవేట్ సంస్థ. బీసీసీఐ పరిపాలన, నిర్వహణ లేదా వ్యవహారాలు ప్రభుత్వ నియంత్రణలో ఉండవు. కార్యనిర్వాహకుల నియామకంలో గానీ, సంస్థ యొక్క అంతర్గత కార్యకలాపాలలో గానీ ప్రభుత్వానికి ఎటువంటి పాత్ర ఉండదు. బీసీసీఐ ఆర్థికంగా స్వతంత్రమైనది. స్పాన్సర్‌షిప్‌లు, ప్రసార ఒప్పందాలు, మీడియా హక్కులు, టిక్కెట్ల అమ్మకాలు.. ఇతర వాణిజ్య కార్యకలాపాలు, ప్రకటనలతో ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది.