ఇద్దరు పిల్లలున్న కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు

ఇద్దరు పిల్లలున్న కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు

ఉత్తరప్రదేశ్ లో జనాభా నియంత్రణకు చట్టం తీసుకొస్తోంది ప్రభుత్వం. బిల్లుకు సంబంధించిన ముసాయిదా సిద్ధం చేసింది రాష్ట్ర లా కమిషన్. దీని ప్రకారం ఇద్దరు పిల్లల విధానాన్ని పాటించిన కుటుంబాలకు మాత్రమే గవర్నమెంట్ నుంచి బెనిఫిట్స్ అందుతాయి. వారు మాత్రమే సంక్షేమ పథకాలకు అర్హులని డ్రాఫ్ట్ లో పొందుపరిచారు. పాలసీని ఫాలోకానివారికి ప్రభుత్వ పథకాలు వర్తించవు. రేషన్ కార్డులు ఉండవు. గవర్నమెంట్ జాబ్స్ కు కూడా దరఖాస్తు చేసుకోలేరని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ అప్పటికే గవర్నమెంట్ ఉద్యోగులైనట్టైతే... ప్రమోషన్స్ ఉండబోవని ఉత్తరప్రదేశ్ లా కమిషన్ తేల్చి చెప్పింది. డ్రాఫ్ట్ పై ప్రజల నుంచి సలహాలు, సూచనలు ఆహ్వానిస్తోంద ప్రభుత్వం.  బిల్లును ఆగస్ట్ రెండోవారంలో అసెంబ్లీలో పెట్టేందుకు ప్లాన్ చేస్తోంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం.