ఇళ్లు లేని వ్యక్తిని ఇంటికి వెళ్లాలని డిమాండ్ చేయడం కరెక్టా..?

ఇళ్లు లేని వ్యక్తిని ఇంటికి వెళ్లాలని డిమాండ్ చేయడం కరెక్టా..?

శ్రీలంకలో గత కొన్ని రోజులుగా ఆర్థిక సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు పరిణామ క్రమాలు చోటుచేసుకున్నాయి. ఫైనల్ గా ఇటీవల శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే బాధ్యతలు చేపట్టారు. కాగా ఈ నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా అధ్యక్ష భవనాన్ని విడిచి ఇంటికి వెళ్లాలంటూ గో హోమ్ అనే నినాదం చేస్తూ... గత కొన్ని రోజులుగా ఆందోళ చేస్తున్నారు. ఈ నినాదంపై తాజాగా ఆ దేశాధ్యక్షుడు రణిల్ స్పందించారు. అసలు వెళ్లడానికి తనకు ఇళ్లనేదే లేదని చెప్పారు. 

జులై 9న నాటి శ్రీలంక ప్రధానిగా ఉన్న రణిల్ విక్రమసింఘే ప్రైవేట్ నివాసంలోకి చొచ్చుకెళ్లిన నిరసనకారులు.. ఆ ఇంటిని తగలబెట్టడం తెలిసిందే.  ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా నియమితులయ్యారు. తాజాగా అధ్యక్ష అధికారిక భవనాన్ని ముట్టడిస్తామని నిరసనకారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో తమ ప్రయత్నాన్ని విరమించుకోవాలని రణిల్ విజ్ఞప్తి చేశారు. కాల్చివేసిన తన ఇంటిని పునర్ని ఆయన కోరారు. ఇళ్లు లేని వ్యక్తిని ఇంటికి వెళ్లాలని డిమాండ్ చేయడం సరైందని కాదని రణిల్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.