వరదల్లో పాడైన వాహానాలకు నో ఇన్సూరెన్స్

వరదల్లో పాడైన వాహానాలకు నో ఇన్సూరెన్స్

ఇన్సూరెన్స్​ కంపెనీల కొర్రీలతో.. ఖర్చు మోపెడు
ఓనర్లకు భారమైన వెహికల్స్ రిపేర్లు
వరదలో మునిగిన వెహికల్స్​ తీసుకెళ్లడంతో సర్వీస్ సెంటర్లన్నీ ఫుల్
రూల్స్​ పెడుతున్న ఇన్సూరెన్స్ కంపెనీలు
చేతినుంచే కడుతున్న వెహికల్స్​ ఓనర్లు

హైదరాబాద్, వెలుగు: సిటీలో భారీ వానల కారణంగా వరదలో మునిగిపోయిన వెహికల్స్ ​షెడ్లకు చేరాయి. బైకులు, ఆటోలు, కార్లు అనే తేడా లేకుండా లోతట్టు ప్రాంతాల్లోని వెహికల్స్​ అన్నీ కరాబ్ అయ్యాయి. కొన్నిచోట్ల వెహికల్స్​ కొట్టుకుపోయి పనికి రాకుండా పోయాయి. రిపేర్లకు వేలల్లో ఖర్చవుతుండగా ఓనర్లకు ఆర్థిక భారంగా మారింది. ఇన్సూరెన్స్​ ఉన్న వెహికల్స్​ ఓనర్లు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కొన్ని ఇన్సూరెన్స్​ కంపెనీలు టైమ్‌కు పరిహారం చెల్లించకపోవడంతో చేతి నుంచి చెల్లిస్తున్నారు. మరికొన్ని కంపెనీలు రూల్స్ ​పేరిట కొర్రీలు పెడుతున్నాయి.

వేల నుంచి లక్షల్లో ఖర్చు
వెహికల్స్​ రిపేర్లకు వేల రూపాయల్లో ఖర్చు అవుతోంది. టూ వీలర్లకు రూ.3 వేల నుంచి రూ.15 వేలు, ఆటోలకు రూ.5 వేల నుంచి
రూ.20 వేల వరకు, కార్లకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు అవుతోంది. మునిగిన వెహికల్స్​లో ఇంజిన్ ప్రాబ్లమ్సే ఎక్కువగా ఉంటున్నాయని మెకానిక్‌లు చెబుతున్నారు. వరదల కారణంగా దాదాపు 2.4లక్షల ఆటోలు, కార్లు, 5 లక్షల బైకులు నీట మునిగాయనే అంచనా ఉంది. ప్రధానంగా ఆటోలు, కార్ల రిపేర్ల ఖర్చు భారంగా మారింది. సిటీలో ఆటో, కారు కలిపి ఆథరైజ్డ్ సర్వీసింగ్ సెంటర్లు 20వేలుగా ఉన్నాయి. 72 బండ్లలో 18 కార్లు ఫ్లడ్ ఎఫెక్టెడేనని నాంపల్లిలోని ఓ సర్వీస్ సెంటర్ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ లెక్కన సర్వీసింగ్ సెంట్లరకు వచ్చే వాటితో 30శాతానికి పైగా వెహికల్స్​ వరదల్లో మునిగిపోయినవే ఉన్నాయి.

ఇంజిన్ లోకి వరద నీరు చేరితే..
వెహికిల్స్​కి ఇన్సూరెన్స్​ ఉన్నప్పటికీ ఓనర్లు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. టైమ్‌కు పరిహారం చెల్లించకపోవడంతో జేబుల్లోంచి డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. మరికొన్ని ఇన్సూరెన్స్​ కంపెనీలు రూల్స్​ అంటూ కొర్రీలు పెడుతున్నాయి. సాధారణంగా జనరల్ ఇన్సూరెన్స్ చేయించుకున్న వారు యాడ్ ఆన్ సర్వీస్, రోడ్ సైడ్ అసిస్టెంట్, ఇంజిన్ ప్రొటెక్షన్, జీరో డిప్రియేషన్ వంటి అదనపు సౌకర్యాలు ఉంటాయి. వరదల్లో కొట్టుకుపోయిన వెహికల్స్​కు కొన్ని కంపెనీలు పరిహారం ఇస్తుండగా, మరికొన్ని కంపెనీలు ఇవ్వడం లేదు. జనరల్ ఇన్సూరెన్స్ తీసుకున్న వెహికల్స్​ ఇంజిన్‌లోకి వరద నీరు చేరితే క్లయం ప్రాబ్లమ్‌గా మారుతోందని ఓనర్లు చెబుతున్నారు. ఇక బండి పూర్తిగా మునిగి ఇంజన్ ప్రొటెక్షన్ కవరేజీ లేకపోతే, ఇంజన్ పై వేసిన చార్జీలన్నీ ఓనర్లు భరించాల్సి వస్తుందని బీమా ఏజెంట్లు పేర్కొంటున్నారు.

నెలరోజులు ఆగాల్సిందే…
వరదల్లో కొట్టుకుపోయిన వెహికల్స్​ మళ్లీ నడపడానికి కనీసం నెలరోజులైన పడుతుంది. ఇప్పటికీ అన్ని సర్వీసింగ్ సెంటర్లలో ఫుల్‌గా ఉన్నాయి. దీంతో పార్కింగ్ సమస్య తీవ్రంగా ఉంది. దీంతో రొటీన్ సర్వీసింగ్ పనులు చేయలేకపోతున్నారు. ఇక ఫ్లడ్ ఎఫెక్టెడ్ వెహికల్ రిపేర్ చేయాలంటే అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇంజిన్ సమస్యలను పక్కాగా అంచనా వేయాలి. లేదంటే బండి పూర్తిగా పనికి రాకుండా పోయే ప్రమాదం ఉందని మెకానిక్‌లు చెబుతున్నారు. ఇప్పటి వరకు వచ్చిన వెహికల్స్​లో పూర్తిగా పనిచేయని వాటి సంఖ్య చాలా తక్కువగా ఉంది. మేజర్ రిపేర్లు ఉన్న వెహికల్స్​ ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు.

ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలె
నీట మునిగిన ఆటోల డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలి. సిటీలో చాలా మంది ఆటో డ్రైవర్లు ఇన్సూరెన్స్ చెల్లించే స్థోమత కూడా లేదు. పాడైన ఆటోల ఖర్చులను ప్రభుత్వం భరిస్తేనే ఆర్థికంగా నిలబడతారు. వరద సాయం తరహాలో ఆటో డ్రైవర్లకు భరోసా కల్పించి న్యాయం చేయాలె.
‑ సత్తిరెడ్డి, ఆటో యూనియన్ సంఘం

పూర్తిగా పాడైతేనే ఇన్సూరెన్స్
ఇంజిన్, పవర్ స్టీరిం గ్, ఎలక్ట్రిఫికేషన్, సీట్ డ్యామేజ్ వెహికల్స్ ఎక్కువగా ఉన్నాయి. వరదల్లో పూర్తిగా పాడైన వెహికల్స్​కే ఫుల్ ఇన్సూరెన్స్ వస్తుంది. కస్టమర్ తీసుకున్న పాలసీని బట్టి ఇంజన్ పాడైతే ఇన్సూరెన్స్ వర్తించకపోవచ్చు. ఇప్పటి వరకు 112 ఇన్సూరెన్స్ క్లయిం చేసుకోగా, అన్నీటికి 80–90 శాతం డ్యామేజ్ ఇన్సూరెన్స్ క్లయిం చేశాం. ఫీల్డ్ సర్వే జాప్యం కారణంగా ప్రాసెస్ కొంత ఆలస్యం అవుతుంది.
‑ సుగుణాకర్ రావు, హైదరాబాద్ ఇన్సూరెన్స్ మేనేజర్

వెంటనే స్టార్ట్ చేయొద్దు
బండి నీళ్లలో మునిగిపోతే వెంటనే స్టార్ట్ చేయొద్దు. నీళ్లన్నీ పోయేంత వరకు ఆపి బ్రేకులు, ఇంజిన్, స్టీరింగ్ పరిస్థితిని బట్టి టోయింగ్ వెహికల్ ద్వారానే సర్వీసింగ్ సెంటర్‌కు తీసుకెళ్లాలి. చాలామంది కారు లేదా ఆటో తడిగా ఉండగానే స్టార్ట్ చేస్తున్నారు. దీంతో ఇంజిన్‌లో నీటితో షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది. అదే జరిగితే ఇన్సూరెన్స్ కూడా వర్తించకపోవచ్చు.
‑ మోహన్ రెడ్డి, చీఫ్ వర్క్ మేనేజర్

For More News..

పై చదువుల కోసం పక్క రాష్ట్రాలకు పోనంటున్న స్టూడెంట్లు

ప్లే ఆఫ్‌‌ రేస్‌‌ నుంచి వైదొలిగిన ఫస్ట్‌‌ టీమ్

ఒక్క దసరా రోజే 550  బెంజ్‌ కార్ల డెలివరీ

అమెరికాలో అప్పుడే 6 కోట్ల మంది ఓటేసిన్రు