ప్రజలను మాఫియా భయపెట్టలేదు.. యూపీ సీఎం యోగీ

ప్రజలను మాఫియా భయపెట్టలేదు.. యూపీ సీఎం యోగీ

గ్యాంగ్‌స్టర్లు ఇప్పుడు ప్యాంట్లు తడుపుకుంటున్నారని వ్యాఖ్యానించారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఒకప్పుడు మాఫియా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేదని, పారిశ్రామికవేత్తలను బెదిరించడం, వ్యాపారవేత్తలను అపహరించడం చేసేవారని ఆయన గుర్తుచేశారు.ఉత్తరప్రదేశ్‌లో శాంతి భద్రతలకు సంబంధించి సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దోపిడీలు, బెదిరింపులతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన గ్యాంగ్‌స్టర్లు ఇప్పుడు ప్యాంట్లు తడుపుకుంటున్నారని వ్యాఖ్యానించారు. శనివారం గోరఖ్‌పూర్‌లో బాటిలింగ్ ప్లాంట్‌కు భూమి పూజ చేసిన అనంతరం ప్రజలనుద్దేశించి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. గతంలో శాంతి భద్రతలను గౌరవించని వారు ఇప్పుడు ప్రాణాల కోసం పరిగెడుతున్నారంటూ.. దీనిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. వారికి కోర్టులు శిక్ష విధిస్తున్నప్పుడు, గ్యాంగ్‌స్టర్ల ప్యాంట్లు తడిసిపోతున్నాయని సీఎం వ్యాఖ్యానించారు. ఆరేళ్ల క్రితం వరకు  మాఫియా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేదని, పారిశ్రామికవేత్తలను బెదిరించడం, వ్యాపారవేత్తలను అపహరించడం చేసేవారని ఆయన గుర్తుచేశారు. 

బీజేపీ హయాంలో అల్లర్లు లేవు


2006లో ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసులో గ్యాంగ్‌స్టార్ అతిక్ అహ్మద్ మరో ఇద్దరిని దోషులుగా నిర్ధారించి.. వారికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన నేపథ్యంలో సీఎం వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అహ్మద్‌పై వందకు పైగా కేసులు నమోదైన నేపథ్యంలో అతనికి ఇదే తొలి శిక్ష అన్నారు. 60 ఏళ్ల అతిక్ అహ్మద్‌ను గుజరాత్‌లోని సబర్మతి జైలు నుంచి రోడ్డు మార్గంలో ప్రయాగ్‌రాజ్‌కు తీసుకొచ్చారు యూపీ పోలీసులు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నేపథ్యంలో.. పోలీసులు తనను ఎన్‌కౌంటర్ చేస్తారని అతను ఆరోపించాడు. ఉత్తరప్రదేశ్​లో  ఏ మాఫియా, గ్యాంగ్‌స్టర్‌ల గురించి భయపడాల్సిన అవసరం లేదని,  ఇకపై ఏ పారిశ్రామికవేత్తను ఫోన్‌లో బెదిరించలేరని అన్నారు. 2014కు ముందు రాష్ట్రంలో శాంతిభద్రతలు అస్తవ్యస్తంగా ఉండేవంటూ.. గతంలో హింసాత్మక సంఘటనలు నిత్యం  ఎక్కడొకచోట జరిగి అల్లర్లు చెలరేగేవని యూపీ సీఎం యోగి అన్నారు. 2017 నుంచి 2023 మధ్య ఉత్తరప్రదేశ్‌లో ఒక్క అల్లర్ల ఘటన కూడా జరగలేదన్నారు.

యూపీలో  జరుగుతున్న అభివృద్ధి పనులపై సీఎం యోగి మాట్లాడుతూ.. గంగా ఎక్స్‌ప్రెస్‌వే పనులు కొనసాగుతున్నాయని, 2025 కుంభమేళా కంటే ముందే పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. పారిశ్రామికవేత్తలు, వ్యాపారులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఉత్తరప్రదేశ్ ఇప్పుడు 4-లేన్ ఇంటర్‌స్టేట్ కనెక్టివిటీని కలిగి ఉందని యోగి తెలిపారుబీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితి మారిందని, ఇప్పుడు అన్ని జిల్లాలకు 24X7 విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పారు. .రైల్వే ఫ్రైట్ కారిడార్ ఉత్తరప్రదేశ్ గుండా వెళుతుండగా, రాష్ట్రం నుంచి ఎగుమతులు లక్ష 75 వేల  లక్షల కోట్లకు పెరిగాయని సీఎం యోగి తెలిపారు.