
రాష్ట్రం లోని సర్కార్ జూనియర్ కాలేజీల్లో మిడ్ డే మీల్స్ అంటూ మూడేండ్ల నుంచి ప్రభుత్వం ఊరిస్తూ వస్తున్నా ఆ స్కీమ్ ఈ ఏడాది కూడా ప్రారంభమయ్యేలా కనిపించడం లేదు. కాలేజీల్లో మధ్యాహ్నభోజనం అందించేందుకు ఇంటర్ బోర్డు అధికారులు ఇటీవల ప్రతిపాదనలు చేయగా.. ప్రభుత్వం వాటిని బడ్జెట్ లిస్టు నుంచి తొలగించినట్టు తెలుస్తోంది. రాష్ట్రం లో 404 ప్రభుత్వ జూనియర్ కాలేజీలున్నాయి. వీటిలో ఫస్టియర్,సెకండియర్ కలిపి లక్షా 80వేల మంది చదువుతున్నారు. మూడేం డ్ల క్రితం అప్పటి విద్యాశా ఖ మంత్రి కడియం శ్రీహరి సర్కారు ఇంటర్ కాలేజీల్లో మిడ్ డే మీల్స్ పెడుతామని ప్రకటిం చారు. ఆ తర్వాత దాన్ని ప్రభుత్వం పక్కనబెట్టింది. హామీని నిలబెట్టుకోవాలని స్టూ డెంట్స్ యూనియన్ల ఆందోళనలు నిర్వహిం చాయి. ఈ క్రమంలో 2018లో మంత్రుల కమిటీ పలుమార్లు సమావేశమైంది. ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో నే కాదు డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటీఐ, బీఈడీ, డీఈడీ కాలేజీల్లో కూడా మిడ్ డే మీల్స్ పథకాన్ని ప్రారంభిస్తామని అప్పట్లో మంత్రులు ప్రకటిం చారు. అక్షయపాత్ర సంస్థ చేసిన వంటలను సెక్రటేరియెట్ కు తెప్పించు కొని వారు రుచి కూడా చూశారు. ఇక ప్రారంభించడమే తరువాయి అని అందరూ భావించారు. ఇతర కాలేజీల్లో కాదు కదా.. కనీసం ఇంటర్ కాలేజీల్లో నూ ఇప్పటికీ ఈ స్కీం మొదలుకాలేదు.
ప్రతిపాదనలు తిరస్కరణ
ఈ విద్యాసంవత్సరం నుం చైనా ఇంటర్ స్టూడెంట్స్ కు మిడ్ డే మీల్స్ పెట్టాలని ప్రతిపాదలను రాష్ట్ర ప్రభుత్వం ముందు ఇంటర్ బోర్డు అధికారులు ఉంచారు. మొత్తం ఇంటర్ స్టూడెంట్స్ లో రోజూ 20 వేల మంది అబ్సెంట్ అయినా.. కనీసం 1.60 లక్షల మంది భోజనం తినే అవకాశముందని అంచనా వేశారు. నెలకు రూ. 49 లక్షల వరకూ ఖర్చవుతుందని నివేదిక సిద్ధం చేశారు. ఈ లెక్కన పది నెలలకు రూ. 49 కోట్ల వరకూ నిధులు అవసరమని బడ్జెట్ ప్రతిపాదనల్లో వారు ప్రస్తావించారు. అయితే ఇటీవల జరిగిన సమావేశంలో ఆ ప్రతిపాదనలను ప్రభుత్వ పెద్దలు పక్కన పెట్టినట్టు సమాచారం. నిధులు లేవని, ప్రతిపాదనలను పక్కనపెడ్తున్నట్టు ఇంటర్ బోర్డు అధికారులకు సమాచారం అందించినట్లు తెలిసింది. ప్రస్తుతం కొన్ని జూనియర్ కాలేజీల్లో దాతల సహకారంతో మిడ్ డే మీల్స్ కొనసాగుతోంది. వాటిలో అడ్మిషన్లతోపాటు రిజల్ట్స్ కూడా బాగున్నాయి.అన్ని కాలేజీల్లో మిడ్ డే మీల్స్ నిర్వహిస్తే సర్కారు కాలేజీలు మరిం త బలోపేతమయ్యే అవకాశముందని అధికారులు అంటున్నారు.
ఉచిత బస్‌పాస్‌పై క్లారిటీ కరువు…
ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో చదువుతున్న స్టూడెంట్స్ కు ఉచితంగా బస్‌పాస్‌లు ఇవ్వాలని కొంతకాలంగా డిమాండ్‌కొనసాగుతోంది. ఇందుకోసం సుమారు రూ. 10 కోట్ల వరకూ ఖర్చవుతుందని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసినట్టు సమాచారం. అయితే దానిపై ప్రభుత్వ పెద్దల నుంచి స్పష్టమైన సమాధానం రాలేదని తెలిసింది.