
ఓ చిన్న సినిమా రాష్ట్రంలోని స్కూళ్లల్లో ఇంత మార్పు తీసుకొస్తుంది ఎవరు ఊహించలేదు. ఈ ఆలోచనతో క్లాసు రూం రూపే మారిపోయింది. అంతేకాదు బ్యాక్ బెంచర్స్ అనే వాళ్లే లేరు. వినేష్ విశ్వనాథ్ తీసిన మొదటి సినిమా స్థానార్థి శ్రీకుట్టన్ ఓ పెద్ద మార్పు తెస్తుందని అస్సలు ఊహించలేదు. తిరువనంతపురంలోని ఒక ప్రైమరీ స్కూల్ గురించి తీసిన ఈ మలయాళ సినిమాలో క్లాస్ రూంలో ఉండే వెనుక బెంచ్ సీటింగ్ పద్ధతిని తీసేసి టీచర్ మధ్యలో ఉండేలా రౌండ్ సీటింగ్ పద్ధతిని చూపిస్తుంది. ఈ సినిమా గత నెలలో 'సైనా ప్లే' అనే ఒటిటిలో విడుదలైన తర్వాత కేరళలోని చాలా స్కూల్స్ ఈ పద్ధతిని పాటించడం మొదలుపెట్టాయి.
"కనీసం ఆరు స్కూళ్లు ఇప్పటికే ఈ పద్ధతిని మొదలుపెట్టాయి. వాళ్ళు మా ఇన్‌స్టాగ్రామ్ పేజీని ట్యాగ్ చేసాక మాకు ఈ విషయం తెలిసింది" అని వినేష్ విశ్వనాథ్ చెప్పారు. ఈ సినిమాలోని హీరో శ్రీకుట్టన్ ఒక సైలెంట్ బ్యాక్ బెంచర్. అతను ఎప్పుడూ క్లాసుకి లేటుగా వస్తాడు. చదువుకునే పిల్లలు ముందు కూర్చోవడం, అల్లరి చేసేవాళ్ళు వెనక కూర్చోవడం అనే అలవాటును మార్చాల్సిన అవసరాన్ని ఈ సినిమాలో తెలియజేస్తుంది.
ఈ ఆలోచన కొత్తది కాకపోయిన, 1994లో కేంద్ర ప్రభుత్వం కేరళతో సహా ఆరు రాష్ట్రాల్లో మొదలుపెట్టిన జిల్లా ప్రాథమిక విద్యా కార్యక్రమం (DPEP) కొన్ని స్కూల్స్'లో ఈ సీటింగ్ పద్ధతులను సూచించింది. అయితే చాలా ఇతర స్కూల్స్ పాత పద్ధతినే పాటిస్తున్నాయి. ఈ సినిమా స్టోరీని రాసింది వినేష్. ఆనంద్ మన్మధన్, మురళీ కృష్ణన్, కైలాష్ ఎస్ భవన్ కలిసి సినిమా స్క్రిప్ట్ రాశారు. తిరువనంతపురంలోని పెడికులంలోని గవర్నమెంట్ ఎల్‌పిఎస్‌లో తాను ప్రైమరీ క్లాసుల్లో ఇలాగే కూర్చునేవాడినని వినేష్ చెప్పాడు. కానీ మేము దీన్ని సినిమా క్లైమాక్స్'లో పెట్టినప్పుడు, ఇది ఇన్ని స్కూళ్లకు చేరుతుందని అస్సలు ఊహించలేదు" అని కూడా అన్నారు.
అజు వర్గీస్, జానీ ఆంటోనీ కొంతమంది చైల్డ్ ఆర్టిస్టులు నటించిన ఈ సినిమా మొదట్లో చాలా అడ్డంకులను ఎదుర్కొంది. చివరికి ఒక సంవత్సరం తర్వాత విడుదలైంది. చాలా మంచి రివ్యూస్ వచ్చినా కూడా చాలా తక్కువ థియేటర్లలో మాత్రమే ఆడింది. ఇక ఒటిటిలోకి విడుదలైన ఏడు నెలల తర్వాత వచ్చింది.
ఈ సినిమా తరువాత కొత్త సీటింగ్ పద్ధతిని మొదట ప్రవేశపెట్టిన స్కూల్ కొల్లం జిల్లాలోని వలకోమ్‌లోని RVV HSS. దీనిని కేరళ ప్రభుత్వ రవాణా మంత్రి, మలయాళ సినిమాలో కూడా మంచి హీరో అయిన కేబీ గణేష్ కుమార్ నడిపిస్తున్నారు. ఈ సినిమా థియేటర్లకు రాకముందే మేము అతనికి చూపించాము, అతనికి చాలా నచ్చింది. అతని బంధువులలో ఒకరు మాకు చెప్పే వరకు అతను తన స్కూల్లో ఈ పద్ధతిని ప్రవేశపెట్టాడని మాకు తెలిదు. అయితే, సినిమా విడుదలైనప్పుడు మేము దానిని ప్రమోషన్స్ చేయలేకపోయాము ఎందుకంటే అది సినిమా చివర్లో ఉంటుంది. ఇది ఆన్‌లైన్‌లో టెలికాస్ట్ కావడం మొదలుపెట్టిన తర్వాతే మేము దాన్ని బయటపెట్టాము” అని వినేష్ చెప్పారు.
RVV HSS ప్రిన్సిపాల్ సునీల్ పి శేఖర్ మాట్లాడుతూ ఈ కొత్త ఆలోచన పద్ధతి గత సంవత్సరం 1st క్లాస్ నుండి 4వ క్లాసులో ప్రవేశపెట్టాము. మేము దీన్ని ఇప్పటికి కొనసాగిస్తున్నాము. క్లాస్ రూం సైజ్ ఇంకా ప్రతి సెక్షన్లో విద్యార్థుల సంఖ్య సమానంగా లేకపోవడం వల్ల అన్ని క్లాసుల్లో రౌండ్ సిటింగ్ పద్ధతిని పెట్టడం సాధ్యం కాదు. 35 నుండి 40 మంది విద్యార్థులు ఉన్న క్లాస్ రూమ్స్ ఇక్కడ ఉన్నాయి. అందరు కాన్సెన్ట్రేషన్ చేయాలనే టీచర్ ఆలోచనకు ఇబ్బంది కలగకుండా మేము సిటింగ్ కొంచెం మార్చాము," అని అన్నారు.
ఇప్పటివరకు ఇలాంటి పద్దతిని పాటించిన ఇతర స్కూల్స్'లో కన్నూర్‌లోని పప్పినిస్సేరి వెస్ట్ ఎల్‌పి స్కూల్, అండూర్ ఎఎల్‌పి స్కూల్, త్రిస్సూర్‌లోని ఆర్‌సిసి ఎల్‌పిఎస్ ఈస్ట్ మాంగడ్, పాలక్కాడ్‌లోని తోలనూర్‌లోని జిహెచ్‌ఎస్‌ఎస్, కొల్లంలోని వలకోడ్‌లోని ఎన్‌ఎస్‌వి విహెచ్‌ఎస్‌ఎస్ ఉన్నాయి. ఈ స్కూల్స్'లో చాలా వరకు ప్రతిక్లాసుకి విద్యార్థుల సంఖ్య 20 కంటే తక్కువ అని అన్నారు.