స్థిరమైన ఆర్థిక విధానం అమలు చేసేవరకు ఆర్థిక సాయం చేయం

స్థిరమైన ఆర్థిక విధానం అమలు చేసేవరకు ఆర్థిక సాయం చేయం

కొలంబో : స్థిరమైన ఆర్థిక విధానాన్ని ప్రవేశపెట్టే వరకు శ్రీలంకకు కొత్తగా ఆర్థిక సాయం చేయబోమని, ఈ ఆలోచన తమకు లేదని వరల్డ్​బ్యాంక్​ తెలిపింది. గురువారం ఓ ప్రకటనలో వరల్డ్​బ్యాంక్​ఈ విషయం వెల్లడించింది. బెయిల్​ఔట్​ ప్యాకేజీ పొందే ముందు డెబ్ట్​ రీకన్ స్ట్రక్షన్ పై తన రుణదాతలతో చర్చలు ప్రారంభించాలని లంకను రెండు రోజుల కిందట ఇంటర్నేషనల్​మోనటరీ ఫండ్​(ఐఎంఎఫ్), యూఎన్​అడిగాయి. ఇప్పుడు వరల్డ్​ బ్యాంక్ ఈ ప్రకటన విడుదల చేసింది. ఆర్థిక స్థిరత్వం, సంక్షోభం నుంచి రికవరీ, అభివృద్ధి వంటివి సాధించాలంటే నిర్మాణాత్మక సంస్కరణలపై లంక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వరల్డ్ ​బ్యాంకు ఆ ప్రకటనలో సూచించింది.

‘‘ప్రస్తుతం లంకలో నెలకొన్న పరిస్థితులపై మేం తీవ్రంగా ఆందోళన చెందుతున్నాం. మెడిసిన్లు, వంట గ్యాస్​, ఫర్టిలైజర్లు అందక అక్కడి ప్రజలు తీవ్ర బాధలు అనుభవిస్తున్నారు. అలాగే స్కూళ్లలో పిల్లలకు భోజనం కూడా అందించలేని పరిస్థితి నెలకొంది. పేదలకు నగదు బదిలీ ఆగిపోయింది. ఇప్పటికే లంకకు తన అవసరాల కోసం రూ.12 వేల కోట్ల నిధులు పంపిణీ చేశాం. దీనికి అదనంగా బేసిక్ ​సర్వీసులు కొనసాగడానికి ఇతర ప్రాజెక్టులను కంటిన్యూ చేస్తాం” అని వరల్డ్​ బ్యాంక్​ ఆ ప్రకటనలో పేర్కొంది.