యూపీలో భవిష్యత్తులో కూడా వ్యాట్ పెంచబోం

యూపీలో భవిష్యత్తులో కూడా వ్యాట్ పెంచబోం

యూపీలో సమీప భవిష్యతులో కొత్త పన్ను పెంపు లేదా వ్యాట్ పెంచే అవకాశం లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ప్రజల నుంచి సేకరించిన మొత్తాన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలకే ఖర్చు చేస్తానని చెప్పారు. 202-2-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి  వస్తు సేవల పన్ను (జీఎస్‌టి)వ్యాట్‌గా రూ.1.50 లక్షల కోట్లను వసూలు చేసే లక్ష్యంతో ఆదాయ సేకరణకు సంబంధించి గట్టి ప్రయత్నాలు చేయాలని అధికారులను  ఆయన ఆదేశించారు. వచ్చే 6 నెలల్లో జీఎస్టీలో నమోదైన వ్యాపారుల సంఖ్యను 4 లక్షలకు పెంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. 

జీఎస్టీ రిజిస్ట్రేషన్/రిటర్న్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి వ్యాపారులకు తెలియజేయాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. పన్నుల రూపంలో ప్రజలపై ఎలాంటి భారం పడకుండా చర్యలు  తీసుకోవాలని సూచించారు. తన నివాసంలో జరిగిన ఆదాయ వసూళ్లకు సంబంధించిన రాష్ట్ర పన్నుల శాఖ సమావేశానికి అధ్యక్షత వహించిన సీఎం యోగి  సమీప భవిష్యత్తులో కూడా విలువ ఆధారిత పన్ను (వ్యాట్) పెంచబోమని చెప్పారు.