V6 News

లాల్‌‌‌‌‌‌‌‌ బంగ్లాలో ఓటుకు నోటు తీసుకోబడదు..ఇంటి ముందు ఫ్లెక్సీ కట్టిన ఎమ్మార్పీఎస్‌‌‌‌‌‌‌‌ నాయకుడు

లాల్‌‌‌‌‌‌‌‌ బంగ్లాలో  ఓటుకు నోటు తీసుకోబడదు..ఇంటి ముందు ఫ్లెక్సీ కట్టిన ఎమ్మార్పీఎస్‌‌‌‌‌‌‌‌ నాయకుడు

హాలియా, వెలుగు : ‘ఓటుకు నోటు తీసుకోబడదు’ అని నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలో ఓ ఇంటి ముందు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ పలువురు ఆకట్టుకుంటుంది. నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్‌‌‌‌‌‌‌‌ రాష్ట్ర నాయకుడు గొడవర్తి జానకీ రామయ్య చౌదరి ‘లాల్‌‌‌‌‌‌‌‌ బంగ్లా’ పేరుతో ఇంటిని నిర్మించుకున్నాడు. ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో క్యాండిడేట్లు ఓటర్లను కలుస్తూ ప్రలోభాలకు గురి చేస్తున్నారు. దీంతో జానకిరామయ్య తన ఇంటి గేటుకు లాల్‌‌‌‌‌‌‌‌ బంగ్లాలో ఓటుకు నోటు తీసుకోబడదు’ అని ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. దీంతో అటువైపు వెళ్లే ప్రజలు, వాహనదారులు ఆసక్తిగా గమనిస్తున్నారు.