దలైలామా ఇష్టప్రకారమే తదుపరి వారసుడు:కేంద్ర మంత్రి కిరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజిజు

దలైలామా ఇష్టప్రకారమే తదుపరి వారసుడు:కేంద్ర మంత్రి కిరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజిజు
  • దలైలామా వారసుడిని నిర్ణయించే హక్కు చైనాకు లేదు:కేంద్ర మంత్రి కిరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజిజు 

న్యూఢిల్లీ: బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా వారసుడిని నిర్ణయించే అధికారం పూర్తిగా ఆయనదేనని కేంద్ర మంత్రి కిరణ్‌‌‌‌‌‌‌‌ రిజుజు అన్నారు. అందుకు తమ ఆమోదం కూడా ఉండాలన్న చైనా డిమాండ్‌‌‌‌‌‌‌‌ను తప్పుపట్టారు. 

ప్రపంచవ్యాప్తంగా బౌద్ధులకు దలైలామా స్థానం చాలా కీలకమైనదని చెప్పారు. దలైలామా ఇష్టప్రకారమే తదుపరి వారసుడిని నిర్ణయించాలని కిరణ్‌‌‌‌‌‌‌‌ రిజుజు పేర్కొన్నారు. ఆయన తప్ప మరెవరూ వారసుడిని డిసైడ్‌‌‌‌‌‌‌‌ చేయలేరని చెప్పారు. 

కాగా, భవిష్యత్‌‌‌‌‌‌‌‌ పునర్జన్మను గుర్తించే ఏకైక అధికారం గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్‌‌‌‌‌‌‌‌కు ఉంటుందని, ఇందులో జోక్యం చేసుకునే అధికారం మరెవరికీ లేదని దలైలామా బుధవారం తేల్చి చెప్పారు.