ముందుకు రాని కూతుర్లూ.. వరండాలోనే డెడ్‌‌‌‌బాడీ

ముందుకు రాని కూతుర్లూ.. వరండాలోనే డెడ్‌‌‌‌బాడీ
  • కర్నాటకలోని మాండ్య జిల్లాలో కరోనా లక్షణాలతో మహిళ మృతి 
  • అంత్యక్రియలకు అయినోళ్లు ముందుకు రాలె.. ఊరోళ్లూ ధైర్యం చేయలె

మాండ్య: కరోనా లక్షణాలతో చనిపోయిన ఓ మహిళ(55) డెడ్​బాడీకి అంత్యక్రియలు చేసేందుకు ఎవరూ ముందుకురాలె.. దీంతో  ఆమె మృతదేహం ఇంటి వరండాలోనే గంటల తరబడి ఉండిపోయింది. చివరకు జిల్లా అధికారులు వచ్చి అంతిమ సంస్కారాలు చేయాల్సి వచ్చింది. కర్నాటకలోని మాండ్య జిల్లా శెట్టి హల్లి గ్రామంలో ఈ సంఘటన జరిగింది. 

బెంగళూరు పోయి వచ్చాక.. 

మాండ్య జిల్లా శెట్టి హల్లి గ్రామానికి చెందిన శివమ్మ అనే మహిళ బెంగళూరులో ఉన్న తన కూతుర్లను చూసేందుకు ఏప్రిల్ 16న వెళ్లింది. శెట్టిహల్లికి వచ్చాక కరోనా లక్షణాలు కనిపించడంతో ఏప్రిల్ 19న టెస్టు చేయించుకుంది. టెస్టు రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న క్రమంలోనే శనివారం ఆమె ఆరోగ్యం క్షీణించింది. పొద్దున 9 గంటల సమయంలో తనకు ఊపిరి ఆడట్లేదని చెప్పడంతో స్థానికులు వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేశారు. హాస్పిటల్ కు వెళ్తుండగా ఆమె చనిపోయింది. అంబులెన్స్ సిబ్బంది ఆమె గ్రామానికి వెళ్లి ఆమె ఇంటి వరండాలో డెడ్ బాడీని వదిలి వచ్చారు.

కూతుర్లూ అంత్యక్రియలకు ముందుకు రాలేదు

కొద్దిమంది గ్రామస్తులు ఆమె డెడ్ బాడీకి దండ వేసి వెళ్లారు. కానీ ఎవరూ అంత్యక్రియలు చేయడానికి ముందుకురాలే. తల్లి మరణ వార్త తెలిసి ఇద్దరు కూతుర్లు ఊరికి వచ్చారు. వాళ్లూ అంత్యక్రియలు చేయలేదు. అప్పటికి 5 గంటలుగా డెడ్ బాడీ వరండాలోనే ఉంది. గ్రామస్తులు హెల్త్ సిబ్బందికి ఫోన్ చేసి కరోనా ప్రోటోకాల్ ప్రకారం అంత్యక్రియలు చేయాలని కోరారు. మరికొందరు గ్రామస్తులు ఊర్లో అంత్యక్రియలు చేయొద్దన్నారు. వాళ్లకు హెల్త్ సిబ్బంది నచ్చజెప్పి అంత్యక్రియలు చేశారు.