V6 News

ఫైర్ సేఫ్టీపై ఎవరూ దృష్టి పెట్టడం లేదు: ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ ఆందోళన

ఫైర్ సేఫ్టీపై ఎవరూ దృష్టి పెట్టడం లేదు: ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ ఆందోళన

మాదాపూర్, వెలుగు: భారీ భవనాలను అందంగా, ఆకర్షణీయంగా కనిపించేలా నిర్మిస్తున్నారు తప్పితే ఫైర్ సేఫ్టీపై ఎవరూ దృష్టి పెట్టడం లేదని తెలంగాణ ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ ఆందోళన వ్యక్తం చేశారు. మాదాపూర్​లో శుక్రవారం ఎఫ్‌‌‌‌ఎస్‌‌‌‌ఏఐ ఆధ్వర్యంలో జరిగిన ఎఫ్‌‌‌‌ఈఎస్‌‌‌‌ఏ-2025 నేషనల్ సెమినార్​ను  ఆయన ప్రారంభించారు. గత పదేండ్లలో హైదరాబాద్​వేగంగా డెవలప్​మెంట్​అవుతుందని, ఎత్తైన భవనాలు నిర్మితమవుతున్నాయన్నారు.

ఎత్తైన భవనాల్లో స్మోక్​ మేనేజ్​మెంట్​పై అందరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అగ్ని ప్రమాదాలకు నాణ్యతలేని ఎలక్ట్రికల్ వైర్లే ముఖ్య కారణమన్నారు. త్వరలో ఫైర్ స్టేషన్ల సంఖ్య పెంచి, అధునాతన ఎక్విప్​మెంట్ తీసుకొస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎఫ్‌‌‌‌ఎస్‌‌‌‌ఏఐ హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షుడు మనోజ్ వాహి, నేషనల్ ప్రెసిడెంట్ వి. శ్రీనివాస్, క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ జైదీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అగ్నిమాపక పరికరాల స్టాళ్లూ ఏర్పాటు చేశారు.