దిండిగల్: డీఎంకే ఎంపీ కనిమొళి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. డీఎంకేను అవినీతి, వారసత్వ పార్టీ అని విమర్శించే హక్కు గోయల్‌కు లేదన్నారు. ఎందుకంటే ఆయన ఒక రాజకీయ కుటుంబం నుంచే వచ్చారని ఎద్దేవా చేశారు. దిండిగల్‌లో పీటీఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు.
బీజేపీని ఒక భారీ వాషింగ్ మెషీన్ అంటూ ఎద్దేవా చేశారు. బీజేపీతో జతకట్టినా లేదా ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నా వారిపై ఉన్న పాత ఆరోపణలన్నీ తుడిచిపెట్టుకుపోతాయని విమర్శించారు. ప్రతిపక్షాలను టార్గెట్ చేయడానికి సీబీఐ, ఈడీ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను బీజేపీ ప్రభుత్వం ఆయుధాలుగా వాడుకుంటోందని ఆరోపించారు.
