న్యూఢిల్లీ: అదానీ గ్రూపులో ఎల్‌ఐసీ పెట్టుబడి కోసం తమ మంత్రిత్వ శాఖ సలహాలు, ఆదేశాలు ఇవ్వదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో రాతపూర్వక సమాధానం ఇచ్చారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్(ఎస్ఓపీలు) ప్రకారమే అవి జరిగాయని స్పష్టం చేశారు.
ఎల్‌ఐసీ నిర్ణయాలు ఇన్సూరెన్స్ చట్టం, ఐఆర్‌డీఏఐ, ఆర్‌బీఐ, సెబీ నిబంధనల ప్రకారం ఉంటాయని మంత్రి తెలిపారు. ఎల్ఐసీ ఈ ఏడాది మేలో అదానీ పోర్ట్స్‌లో రూ.ఐదు వేల కోట్లు పెట్టుబడి పెట్టింది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి నిఫ్టీ–50 కంపెనీలలో పెట్టుబడి బుక్ వాల్యూ రూ.4,30,776.97 కోట్లుగా ఉంది. రిలయన్స్‌లో రూ.40,901.38 కోట్లు ఇన్వెస్ట్ చేసింది.
