వెనక్కి తగ్గిన చైనా.. అమరుల త్యాగాలను కేంద్రం అవమానిస్తోంది

వెనక్కి తగ్గిన చైనా.. అమరుల త్యాగాలను కేంద్రం అవమానిస్తోంది

న్యూఢిల్లీ: దేశం కోసం త్యాగాలు చేసిన అమర జవాన్లను కేంద్ర ప్రభుత్వం అవమానిస్తోందని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఆరోపించారు. సరిహద్దుల నుంచి చైనా తన బలగాలను దశల వారీగా ఉపసంహరించుకుంటోందని రాజ్యసభలో రక్షణ మంత్రి రాజ్‌‌నాథ్ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ పైవిధంగా స్పందించారు. బార్డర్ నుంచి డ్రాగన్ బలగాలను పోనివ్వడం ద్వారా మన సైనికుల త్యాగాలను ప్రభుత్వం అవమానిస్తోందని రాహుల్ మండిపడ్డారు. లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి యథాతథ స్థితిని నెలకొల్పడంలోనూ, శాంతిభద్రతలను కాపాడటంలోనూ కేంద్రం విఫలమైందని విమర్శించారు. చైనాతో సరిహద్దు వివాదం ఏర్పడినప్పటి నుంచి ఈ విషయంపై రాహుల్ చాలా మార్లు కేంద్రాన్ని, ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ కామెంట్లు చేశారు.