V6 News

రెజోనెన్స్ స్కూల్కు రెసో ఫాస్ట్ పరీక్షకు నో పర్మిషన్

రెజోనెన్స్ స్కూల్కు రెసో ఫాస్ట్ పరీక్షకు నో పర్మిషన్

గండిపేట/ముషీరాబాద్, వెలుగు: అత్తాపూర్ ప్రాంతంలో నడుస్తున్నట్టు చెప్పుకునే రెజోనెన్స్ స్కూల్కు విద్యాశాఖ నుంచి ఎలాంటి అధికారిక గుర్తింపు లేదని, డిసెంబర్ 14న నిర్వహించనున్నట్టు ప్రకటించిన మెగా రెసో ఫాస్ట్ ప్రవేశ పరీక్షకు కూడా ఎలాంటి అనుమతి మంజూరు కాలేదని మండల విద్యాధికారి శంకర్ రాథోడ్ స్పష్టం చేశారు. 

విద్యార్థులు ఈ అనుమతి లేని పరీక్షకు హాజరు కావద్దని, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. అనుమతులు లేకుండా స్కూల్​ నడపడమే కాకుండా టాలెంట్​ టెస్ట్​ పేరుతో మోసం చేస్తున్న రెజొనెన్స్​ యాజమాన్యంపై క్రిమినల్​ చర్యలు తీసుకోవాలని బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ లింగంగౌడ్ శుక్రవారం రీజినల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సోమిరెడ్డికి ఫిర్యాదు చేశారు.