ఎన్నార్సీని అమలు చేసే ఆలోచన లేదు

V6 Velugu Posted on Apr 04, 2021

కోల్ కతా: బెంగాల్ లో ఎన్నార్సీని అమలు చేసే ఆలోచన తమకు లేదని బీజేపీ నేషనల్ జనరల్ సెక్రెటరీ కైలాశ్ విజయ్ వర్గియా తెలిపారు. అయితే సీఏఏను మాత్రం తప్పకుండా అమలు చేస్తామన్నారు. 'మేనిఫెస్టోలో చెప్పినట్లు సీఏఏను ఎన్నికలయ్యాకే అమలు చేస్తాం. శరణార్థులకు పౌరసత్వం ఇచ్చే ప్రక్రియలో ఇది మాకు చాలా ప్రాధాన్యమైన విషయం. ఎన్నార్సీని ముందుకు తీసుకెళ్ళే ఆలోచన లేదు. ఒకవేళ మేం గెలిచినా ఎన్నార్సీని అమలు చేసే అవకాశాలు తక్కువే'నని కైలాశ్ చెప్పారు. 

Tagged Bjp, west bengal, CAA, Kailash Vijayvargiya, NRC

Latest Videos

Subscribe Now

More News