పెట్రోల్‌‌పై ట్యాక్స్ తగ్గించే ఆలోచన లేదు

పెట్రోల్‌‌పై ట్యాక్స్ తగ్గించే ఆలోచన లేదు

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరల రేట్లు రోజురోజుకీ పెరుగుతూ వాహనదారులకు షాక్ ఇస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటగా, మరికొన్ని స్టేట్స్‌‌లో రూ.90గా ఉంది. తమ జేబులకు భారీగా చిల్లులు పడుతుండటంతో దీనిపై వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో పెట్రోల్ రేట్ల తగ్గింపుపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. ఇప్పట్లో పెట్రో రేట్లు తగ్గే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. పెట్రోల్ మీద పన్నులు తగ్గించే ప్రపోజల్స్ కేంద్రానికి లేవని రాజ్యసభలో ప్రధాన్ క్లారిటీ ఇచ్చారు.