20 ఏండ్ల నుంచి డైట్ కాలేజీల్లో రిక్రూట్​మెంట్​ బంద్​

20 ఏండ్ల నుంచి డైట్ కాలేజీల్లో రిక్రూట్​మెంట్​ బంద్​
  • డైట్ కాలేజీల్లో సార్లేరి?
  • 20 ఏండ్ల సంది రిక్రూట్​మెంట్​ బంద్​ 
  • 10 కాలేజీల్లో మొత్తం 288 పోస్టులు.. వీటిలో 267 ఖాళీ
  • 17 మందే రెగ్యులర్​ లెక్చరర్లు, నలుగురే ప్రిన్సిపాల్స్​  
  • 70 సీనియర్​ లెక్చరర్​ పోస్టులూ ఖాళీగానే 

హైదరాబాద్,  వెలుగు: కాబోయే టీచర్లకు ట్రైనింగ్​ ఇవ్వాల్సిన కాలేజీల్లోనే లెక్చరర్లకు కరువొచ్చింది. రాష్ట్రంలో10 డైట్​ కాలేజీల్లో 21 మంది సార్లు మాత్రమే ఉన్నారు. మొత్తం 288 పోస్టులను శాంక్షన్​ చేయగా 267 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. దీంతో రెగ్యులర్​ టీచింగ్​ స్టాఫ్​​లేక డైట్​ కాలేజీలన్నీ వెలవెలబోతున్నాయి.  20 ఏండ్ల నుంచి ఆ కాలేజీల్లో పోస్టులను భర్తీ చేయట్లేదు. ప్రస్తుతం ఉన్న వారిలో ఎవరైనా రిటైర్​ అయితే ఆ పోస్టు ఖాళీగా ఉంటోంది. సర్వీస్​​రూల్స్​​సమస్యను సాకుగా చూపుతూ కాలేజీల్లో రిక్రూట్మెంట్​ను ప్రభుత్వాలు పక్కన పెట్టేశాయి.

కోర్టు ఆదేశాలతో..

రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాకొకటి చొప్పున10  డైట్ కాలేజీలున్నాయి.  వీటన్నింటిలో 10 ప్రిన్సిపాల్​ పోస్టులు, 70 సీనియర్​ లెక్చరర్​​పోస్టులు, 208 లెక్చరర్​ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సీనియర్ లెక్చరర్​ పోస్టుల్లో 70కి 70 ఖాళీగానే ఉన్నాయి.  చివరిసారిగా ఈ కాలేజీలకు 1998లో 30 శాతం మందిని డైరెక్ట్​ రిక్రూట్​మెంట్​ ద్వారా తీసుకున్నట్టు యూనియన్లు తెలిపాయి. ఆ తర్వాత నుంచి అన్ని పోస్టులనూ టీచర్లకు ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. కోర్టు ఆదేశాల వల్ల 200 నుంచి రిక్రూట్​మెంట్​ ఆగింది.

ఉన్నోళ్లకూ వేరే పనులు

ఇప్పుడున్న రెగ్యులర్​ స్టాఫ్​లోనూ కొందరు వేరే డ్యూటీలు చేస్తున్నారు. నలుగురు ప్రిన్సిపాళ్లలో ఇద్దరు ఆదిలాబాద్​, వరంగల్​ అర్బన్​  జిల్లాల్లో ఇన్​చార్జి డీఈవోలుగా కొనసాగుతున్నారు. రాష్ట్రమంతటా17 మంది రెగ్యులర్ లెక్చరర్లుండగా, వారిలో ఐదుగురు భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్​, నారాయణపేట, పెద్దపల్లి, జగిత్యాల, జయశంకర్​ భూపాలపల్లి, ఆదిలాబాద్​ జిల్లాల్లో ఇన్​చార్జ్​ డీఈవోలుగా పనిచేస్తున్నారు. నల్గొండలో ఒక్కరే రెగ్యులర్​ లెక్చరర్​​ఉండగా, మిగిలిన ప్రిన్సిపాల్​, సీనియర్​ లెక్చరర్ ​​పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి. హైదరాబాద్​, వరంగల్​ డైట్​ కాలేజీల్లో  ప్రిన్సిపాళ్లు​మాత్రమే రెగ్యులర్​కాగా.. మిగిలిన పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి. వరంగల్​​ప్రిన్సిపాల్​​కూడా ఇన్​చార్జ్​ డీఈవోగా ఉండటంతో, ఆ కాలేజీలో అంతా గెస్ట్​ లెక్చరర్లే పని చేస్తున్నారు. మహబూబ్​నగర్​ కాలేజీలో ఐదుగురు, కరీంనగర్​లో ముగ్గురు, రంగారెడ్డి, ఆదిలాబాద్​, ఖమ్మం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, మెదక్​, నిజామాబాద్​​కాలేజీల్లో ఒక్కొక్కరు చొప్పున రెగ్యులర్ లెక్చరర్లు ఉన్నారు.

వచ్చే నెల నుంచే కాలేజీలు

ఫిబ్రవరి ఫస్ట్​ నుంచి డైట్​ కాలేజీలు ప్రారంభం కానున్నాయి. రెగ్యులర్​ లెక్చరర్లు లేకపోయినా కనీసం గెస్ట్​ లెక్చరర్లను తీసుకోలేదు. దీంతో స్టూడెంట్స్​​ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, డైట్​ కాలేజీల్లో టీచింగ్​ పోస్టులను భర్తీ చేయాలని కోరుతున్నారు.

For More News..

కిలిమంజారో పర్వతమెక్కిన హైదరాబాద్ సీపీ

మా బతుకులతో ఆడుకుంటున్నరు.. నర్సింగ్​ అభ్యర్థుల ఆందోళన

హోం ట్యూషన్లకు ఫుల్ డిమాండ్​.. నెలకు రూ. 3 నుంచి 15 వేలు

V6 రేటింగ్​పై కుట్ర.. రేటింగ్​ పెరగకుండా ప్రయత్నాలు