నిలోఫర్ లో 3 నెలలుగా జీతాల్లేవ్

నిలోఫర్ లో 3 నెలలుగా జీతాల్లేవ్
  • ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఆందోళన
  • లేబర్ కమిషనర్, కలెక్టర్కి కంప్లయింట్ చేస్తామంటున్న స్టాఫ్

హైదరాబాద్, వెలుగు: నిలోఫర్ హాస్పిటల్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ కు 3 నెలలుగా శాలరీలు ఇవ్వడం లేదు. మూడేళ్లుగా ఇదే పరిస్థితి ఉందని, ఎవరికి చెప్పినా పట్టించుకోవడంలేదని ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే తమకు ప్రతిసారి ఇదే సమస్య వస్తుందని, ఎన్నోసార్లు అడిగితే తప్ప శాలరీలు ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. 2008లో జీవో నం.213 ప్రకారం ఫోర్త్​ క్లాస్ ఎంప్లాయీస్ 60 మంది, పారామెడికల్ స్టాఫ్ 18 మంది, స్టాఫ్ నర్స్​25
మందితో పాటు డాక్టర్స్​ని కూడా రిక్రూట్ చేశారన్నారు. కొన్నేళ్ల తర్వాత స్పెషల్ జీవో ద్వారా కేవలం డాక్టర్లను మాత్రమే పర్మినెంట్ చేశారు. మిగతా వారిని పర్మినెంట్ చేయకపోవడంతో పాటు శాలరీలు టైమ్ కి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారన్నారు. కరోనా కారణంగా గతేడాది మార్చిలో ఔట్ సోర్సింగ్ కింద మరి కొందరు స్టాఫ్ నర్సులను రిక్రూట్ చేశారన్నారు. ప్రస్తుతం దాదాపు 150 మందికి ఔట్ సోర్సింగ్ స్టాస్టాఫ్ కి శాలరీలు రావడం లేదని వాపోయారు. ఈ విషయంపై మంగళవారం లేబర్ కమిషనర్ తో
పాటు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కి కంప్లయింట్ చేచేసేందుకు స్టాఫ్ నర్స్​లు, పారా మెడికల్ స్టాఫ్ ,ఫోర్త్​ క్లాస్ ఎంప్లాయీస్ రెడీ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

తాడ్వాయి పవర్ ప్లాంట్ దగ్గర చిరుత సంచారం

పెళ్లి వేడుకల్లో మందు వాడకుంటే పదివేలు బహుమతి

ఈ-మోటార్ సైకిల్ ను లాంచ్ చేసిన అటు మొబైల్ సంస్థ

పేద విద్యార్ధికి దాతల అండ.. వీ6, వెలుగు కథనానికి స్పందన