స్పైస్ జెట్ పైలట్లకు రెండు నెలల జీతాలు కట్

స్పైస్ జెట్ పైలట్లకు రెండు నెలల జీతాలు కట్

న్యూఢిల్లీ : స్పైస్ జెట్ సంస్థ తమ పైలట్లకు షాక్ ఇచ్చింది. ఏప్రిల్, మే నెలలకు సంబంధించి వారికి జీతాలు చెల్లించమని తెలిపింది. సంస్థ ఫ్లైట్స్ ఆపరేషన్స్ హెడ్ కెప్టెన్ గుర్చరణ్‌ అరోరా ఈ మేరకు తమ పైలట్లకు లెటర్ రాశారు. లాక్ డౌన్ టైమ్ లో కార్గో విమానాలు నడిపిన పైలట్లకు మాత్రమే జీతాలు చెల్లిస్తామని ఆయన తెలిపారు. అది కూడా పనిచేసిన గంటలను లెక్కలోకి తీసుకొని చెల్లిస్తామన్నారు. దేశంలో అత్యంత తక్కువ ధరకే విమాన ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది స్పైస్ జెట్. కొంతకాలంగా ఈ సంస్థ నష్టాల్లో ఉంది. కరోనా ఎఫెక్ట్ తో మరింత కుదేలైంది. ఈ కారణంగానే పైలట్లకు జీతాలు ఇవ్వమని తెలిపింది. లాక్ డౌన్ ముగిసిన తర్వాత మళ్లీ సర్వీసులను ప్రారంభిస్తామని స్పైస్ జెట్ తెలిపింది. ఐతే ఇండిగో ఎయిర్ లైన్స్ మాత్రం ఏప్రిల్ లో తమ ఉద్యోగులకు పూర్తి జీతం ఇస్తామని ఇప్పటికే తెలిపింది.