బడ్జెట్లో తెలంగాణకు మొండిచేయి

బడ్జెట్లో తెలంగాణకు మొండిచేయి
  • దళితులను వంచించారు
  • రైతులకు తీవ్ర అన్యాయం
  • వైయస్సార్టీపి అధ్యక్షురాలు షర్మిళ 

గతేడాది లాగే ఈ సారి కూడా కేంద్రం బడ్జెట్లో తెలంగాణకు మొండిచేయి చూపించిందని వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిళ విమర్శించారు. ఈ రాష్ట్రానికి చెందిన బీజేపి ఎంపీలు రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో విఫలయమయ్యారన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ప్రస్తావనే లేదు. బడ్జెట్ మొత్తం అంకెల గారడీ తప్ప అందులో ఏం లేదన్నారు. ఈ బడ్జెట్లో కూడా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ గురించి ప్రస్తావించలేదన్నారు. ఎన్నికలు జరుగబోయే రాష్ట్రాలకు బడ్జెట్ లో అధిక ప్రాధాన్యమిచ్చారన్నారు. పీఎం డిజిటల్ విద్య కోసం 200 ఛానెల్స్ ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. గత బడ్జెట్ లో చెప్పిన 100 సైనిక్ స్కూల్స్, 750 ఏకలవ్య మోడల్ స్కూల్స్ లలో ఎన్ని ఏర్పాటు చేశారో, ఎన్ని నడుస్తున్నాయో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. టాక్స్ స్లాబ్స్ లో ఎటువంటి మార్పులు చేయకపోవడం మధ్యతరగతి వారిని తీవ్ర నిరాశకు గురిచేసిందని, రైతులకు మద్దతు ధర అంశం ఊసెత్తనేలేదన్నారు. అరకొర నిధులు కేటాయిస్తూ మోడీ పేదల ప్రజల సొంతింటి కలకు తూట్లు పొడిచారని విమర్శించారు షర్మిళ. నిరుద్యోగులను కూడా బడ్జెట్ నిరశపరిచిందన్నారు. సీఎం కేసీఆర్  నిధులు రాబట్టడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలంటూ కేసీఆర్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారన్నారు. కేసీఆర్ తన బూతు మాటలతో సీఎం పదవి ప్రతిష్టను దిగజారుస్తున్నారన్నారు. మోడీ, కేసీఆర్..ఇద్దరికి రాజకీయ ఆరాటమే తప్ప ప్రజలను పట్టించుకోరన్నారు. ఎన్నికలప్పుడే వీళ్లకు ప్రజలు గుర్తుకువస్తారన్నారు. అరకొర నిధులతో మోడీ, సీఎం పదవి ఇవ్వకుండా కేసీఆర్ దళితులును మోసం చేస్తున్నారని మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి..

కార్ల హెడ్లైట్ల కిందే ఎగ్జామ్ రాశారు