టీచర్లు లేరు.. పాఠాలు చెప్పేదెవరూ?... నిర్మల్ జిల్లా సాంగ్విలో స్టూడెంట్స్, పేరెంట్స్ ఆందోళన

టీచర్లు లేరు.. పాఠాలు చెప్పేదెవరూ?... నిర్మల్ జిల్లా సాంగ్విలో  స్టూడెంట్స్, పేరెంట్స్ ఆందోళన

కుభీర్, వెలుగు: స్కూల్​లో చదువు చెప్పేందుకు టీచర్లు లేకపోతే, ఎవరూ చెబుతారంటూ..?  పేరెంట్స్ ఆందోళనకు దిగారు. నిర్మల్​జిల్లా కుభీర్ మండలం సాంగ్వి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 1– 6 తరగతులు కొనసాగుతున్నాయి. సుమారు 58 మంది విద్యార్థులు చదువుకుంటున్నా రు. స్కూల్స్ ప్రారంభమై రెండున్నర నెలలు గడుస్తున్నా హెడ్​మాస్టర్​మాత్రమే ఉండగా, మిగతా టీచర్లు లేరు. ఉన్నాతాధికారులు ఇంకెవరినీ నియమించలేదు. 

దీంతో విద్యార్థులకు సరిపడా టీచర్లు లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. బుధవారం స్కూల్ కు తాళం వేసి నిరసన చేపట్టారు. టీచర్లను వెంటనే నియమించాలని డిమాండ్​ చేశారు. విద్యాశాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతో  స్కూల్ లో టీచర్ల నియామకంపై పట్టించుకోవడంలేదని మండిపడ్డారు.  వెంటనే టీచర్లను  నియమించకపోతే ఆందోళనలు చేస్తామన్నారు. సమాచారం అందడంతో ఎంఈవో విజయ్​కుమార్​ స్కూల్ ను సందర్శించి టీచర్లను నియమిస్తామని హామీచ్చారు.