ప్రేమ లేదు.. దోమ లేదు.. నేను సింగిల్: పీవీ సింధు

ప్రేమ లేదు.. దోమ లేదు.. నేను సింగిల్: పీవీ సింధు

సింగిల్ అని చెప్పిందిగా.. మేం ట్రై చేసుకుంటాం అనకండి పెళ్లి కాని ప్రసాదులు..! ఆమెది ఒలింపిక్స్ బ్యాచ్.. తమది ఏ బ్యాచ్ అన్నది ముందుగా ఆలోచించండి. అందునా పీవీ సింధు హైట్ 5 అడుగుల 10 అంగుళాలు. ఇది కూడా ఒకసారి ఆలోచన చేయండి.

భార‌త స్టార్ ష‌ట్ల‌ర్, రెండుసార్లు ఒలింపిక్ విజేత‌ పీవీ సింధు(PV Sindhu) రిలేషన్ షిప్ పై నోరు విప్పింది. రణ్‌వీర్ అల్లాబాడియా పోడ్‌కాస్ట్‌లో పాల్గొన్న సింధు వ్య‌క్తిగ‌త విష‌యాల్ని బయటపెట్టింది. హోస్ట్ నుంచి ఎవ‌రితోనైనా డేటింగ్ చేశారా? అన్న ప్రశ్న ఎదురవ్వగా.. అందుకు తాను సింగిల్‌గానే ఉన్నాన‌ని సింధు బ‌దులిచ్చింది. అందునా తన తండ్రి కారణంగా తనను ఎవరూ బయటకు రమ్మని కూడా అడగలేదని వెల్లడించింది.

"లేదు. నేను ఎవ‌రితోనూ డేటింగ్ చేయ‌లేదు. అయినా అలా చేయ‌డంలో త‌ప్పేమీ లేదు. జీవితం సాగిపోతూనే ఉంది. ఒక‌వేళ ఆ టైమ్ వ‌స్తే అది జ‌రుగుతుంది. ఇప్ప‌టికైతే సింగిల్‌గానే ఉన్నా.." అని చెప్పుకొచ్చింది. అలాగే, మీకు భాగ‌స్వామి కావాల‌ని అనుకుంటున్నారా? అన్న ప్ర‌శ్న‌కు స్వచ్ఛమైన హృదయం ఉన్న వ్యక్తి కావాలని తెలిపింది. అలా అని అన్నీ అనుకున్నట్లు జరగవు కదా! అందువల్ల నుదిటి మీద ఏం రాసుంటే అదే జ‌రుగుతుందని తెలివిగా స‌మాధానం చెప్పింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది.

టార్గెట్ ప్యారిస్‌ ఒలింపిక్స్‌

ఈ ఏడాది ప‌లు టోర్నీల్లో క్వార్టర్‌ ఫైనల్, సెమీస్‌లోనే ఇంటిదారి ప‌ట్టిన సింధు వ‌చ్చే ఏడాది జరిగే ప్యారిస్‌ ఒలింపిక్స్‌ లో ప‌త‌కం సాధించడమే లక్ష్యంగా కఠోర శిక్షణ పొందుతోంది. భారత మాజీ స్టార్ ప్రకాష్ పదుకొణె మెంటార్ గా నెట్స్ లో చెమటలు చిందిస్తోంది. ప్రస్తుతం సింధు తన స్థావరాన్ని హైదరాబాద్ నుండి బెంగళూరుకు మార్చింది.