ఆన్​లైన్​ క్లాస్​లతో నో యూజ్

ఆన్​లైన్​ క్లాస్​లతో నో యూజ్

90% పేరెంట్స్​ది ఇదే ఒపీనియన్​“ఆన్​లైన్ క్లాసులతో పిల్లలు నేర్చుకునేది తక్కువ, మాపైనే ఎక్కువ బర్డెన్ పడుతోంది. వీడియో క్లాసెస్​ యూజ్​ఫుల్​గా లేవు. అదేపనిగా గ్యాడ్జెట్స్ ​చూస్తుండడం వల్ల ఐ ప్రాబ్లమ్స్ ​​​వస్తున్నాయి’’ హైదరాబాద్ స్కూల్స్​ పేరెంట్స్ అసోసియేషన్ సర్వేలో పేరెంట్స్​ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఇది.
లాక్​డౌన్​లో ప్రైవేట్ ​స్కూల్​ మేనేజ్​మెంట్స్ తీరు, ఆన్​లైన్​ క్లాసులు, స్కూల్స్ రీ ఓపెన్ తదితర అంశాలపై సిటీలో ఈ సర్వే చేశారు.

హైదరాబాద్, వెలుగు: స్కూల్​కి వెళ్తే ట్యూషన్, ట్రాన్స్ పోర్టేషన్, లైబ్రరీ, మెస్, యాన్యువల్, ఆక్టివిటీస్, టర్మ్.. ఇలా పలు రకాల ఫీజులను మేనేజ్​మెంట్స్ వసూలు చేస్తాయి. కరోనా ఎఫెక్ట్​తో ఇప్పుడు ఆన్​లైన్ క్లాసులు మాత్రమే చెప్తున్నారు. టీచర్స్ చెప్తున్న దానికే ట్యూషన్ ఫీజు తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే సూచించింది. కిందటేడు ఫీజులే కంటిన్యూ చేయాలని స్పష్టం చేసింది. ప్రైవేట్ స్కూల్స్​ మాత్రం అవేమీ పట్టించుకోవడం లేదు. ట్యూషన్ ఫీజుతో పాటు అన్నీ పే చేయాలంటున్నాయని హెచ్ఎస్​పీఏ సర్వేలో పేరెంట్స్​ తెలిపారు.

యూజ్​ ఉందా అంటే…

టీచర్లు పిల్లలకు ఇచ్చే అసైన్​మెంట్స్ బాధ్యతను పేరెంట్స్ పైనే వేస్తున్నారు. క్లాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి, హోమ్ వర్క్ చేయించే వరకు తల్లిదండ్రులే అన్నీ చూసుకుని టీచర్స్ కి మెయిల్, వాట్సాప్​లో పంపిస్తున్నారు. ఆన్​లైన్ క్లాసుల ద్వారా పిల్లలు చదువు నేర్చుకుంటున్నారని మీరు భావిస్తున్నారా? అనే ప్రశ్నకు 90% మంది ఎలాంటి యూజ్​ లేదని చెప్పారు.

స్కూల్స్​ రీ ఓపెన్​పై...

ఆగస్టులో స్కూల్స్ ఓపెన్ చేసే అవకాశాలున్నా, ఇలాంటి పరిస్థితుల్లో వద్దంటున్నారు పేరెంట్స్. స్కూల్స్ రీఓపెన్ పై ప్రశ్నించగా, డిఫరెంట్​ రెస్పాన్స్ వచ్చింది. జూన్​లో ఓపెన్ చేయాలని 0.9%, జులైలో అని 5.5%, లాక్ డౌన్ ఎత్తేశాక అని 3.4%, గవర్నమెంట్​ ఆదేశాల ప్రకారమని 19.2%, వ్యాక్సిన్ కనిపెట్టిన తర్వాతే ఓపెన్ ​చేయాలని 82.9% మంది పేరెంట్స్ చెప్పారు.

స్కూల్​ ముందు ఆందోళన

ఆన్​లైన్ క్లాస్​లు, ఫీజుల పేరుతో ఇబ్బంది పెడుతున్నారంటూ హిమాయత్​నగర్​లోని వాసవీ పబ్లిక్ ​స్కూల్​ ముందు విద్యార్థుల తల్లిదండ్రులు మంగళవారం ఆందోళనకు దిగారు. లాక్​డౌన్​తో ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే వేలకు వేల ఫీజులు ఎక్కడ్నుంచి తెచ్చి కడతామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్​లైన్ క్లాసులతో పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తున్నామని వాపోయారు. ట్యూషన్ ఫీజు మాత్రమే చెల్లించాలని ప్రభుత్వం చెప్పినా, స్కూల్ మేనేజ్​మెంట్ అన్ని ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేస్తోందని ఆరోపించారు. మొత్తం ఫీజులోని 50% ట్యూషన్ ఫీజును డబుల్​చేసి, అంతా కట్టాలంటున్నారని ఓ పేరెంట్​తెలిపారు.

ఎక్కువ మంది అసంతృప్తిలోనే..

గవర్నమెంట్​రూల్స్​ బ్రేక్ ​చేస్తూ ప్రైవేట్​స్కూల్స్ ఫీజులు వసూలు చేస్తున్నాయి. పే చేస్తేనే క్లాసులు చెప్తామంటూ పేరెంట్స్ ని ఇబ్బంది పెడుతున్నాయి. ఆన్​లైన్ క్లాసులపై తల్లిదండ్రులు అసలేం ఏమనుకుంటున్నారని తెలుసుకోవాలని ఈ నెల ఫస్ట్ వీక్​లో ఆన్​లైన్ సర్వే చేశాం. 1,247 మంది పేరెంట్స్ రెస్పాండ్ అయ్యారు. ఎక్కువ శాతం మంది అసంతృప్తితో ఉన్నారు. త్వరలోనే మరో సర్వే రిలీజ్ చేస్తాం.
‑ సీమా అగర్వాల్ ,
వైస్ ప్రెసిడెంట్, హెచ్ఎస్​పీఏ