ట్విట్టర్ కొత్త సీఈవోపై వైరల్ అవుతోన్న ఆనంద్ మహీంద్రా ట్వీట్

ట్విట్టర్ కొత్త సీఈవోపై వైరల్ అవుతోన్న ఆనంద్ మహీంద్రా ట్వీట్

ట్విట్టర్ కు కొత్త సీఈవోగా భారత సంతతికి చెందిన  పరాగ్ అగర్వాల్ నియమితులవడంపై దేశవిదేశాల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. భారత ప్రముఖ బిజినెస్ మ్యాన్  ఆనంద్ మహీంద్రా కరోనాతో పోల్చుతూ  తనదైన శైలిలో స్పందించారు. ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.‘ ఈ మహమ్మారి భారత్ లో ఉధ్బవించిందని చెప్పడానికి ఆనందంగా, గర్వంగా ఉంది. ఇది ఇండియన్ సీఈవో వైరస్ దీనికి అస్సలు వ్యాక్సిన్ లేదు’అంటూ ట్వీట్ చేశారు. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారితో పోల్చుతూ ఉండటంతో ఈ ట్వీట్ ఇపుడు వైరల్ అవుతోంది

ట్విట్టర్ ప్రస్తుత సీఈవో జాక్ డోర్సీ పదవి నుంచి దిగిపోతా రని కొంతకాలంగా రూమర్స్ వస్తుండగా, తాను వైదొలగుతున్నానంటూ సోమవారం స్వయంగా ప్రకటించారు. జాక్ డోర్పీ స్థానంలో చీఫ్ టెక్నికల్‌ ఆఫీసర్‌‌ (సీటీవో)గా ఉన్న పరాగ్ అగర్వాల్ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం గూగుల్,మైక్రోసాఫ్ట్,అడోబీ, ఐబీఎం,పాలోఆల్ట్ నెట్ వర్క్, ఇపుడు ట్విట్టర్ వంటి సంస్థలకు  ఇండియా సంతతికి చెందిన వ్యక్తులు సీఈవోలుగా ఉన్నారు.