హైదరాబాద్సిటీ, వెలుగు: నగరానికి తాగునీటిని సరఫరా చేసే మంజీరా ఫేజ్–-2 లోని పటాన్చెరు నుంచి హైదర్ నగర్ వరకు ఉన్న 1500 ఎంఎం డయా పంపింగ్ మెయిన్ పైప్లైన్ ధ్వంసమైంది. నేషనల్ హైవే అథారిటీ అధికారులు చేపడుతున్న రోడ్డు విస్తరణ పనుల సందర్భంగా పొరపాటున పైప్లైన్ ధ్వంసమైందని అధికారులు తెలిపారు. లీకేజీని అరికట్టడానికి వాటర్బోర్డు అత్యవసర రిపేర్లు మొదలుపెట్టగా, బోర్డు ఎండీ అశోక్ రెడ్డి మంగళవారం తనిఖీ చేశారు.
పైప్లైన్రిపేర్ల కారణంగా బుధవారం ఆర్సీ పురం, అశోక్ నగర్, జ్యోతి నగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, మదీనాగూడ, మియాపూర్, బీరంగూడ, అమీన్పూర్, భాగ్యనగర్ కాలనీ, ఆఫ్ టేక్ పాయింట్స్, ఎర్రగడ్డ, ఎస్.ఆర్.నగర్, అమీర్ పేట్, కేపీహెచ్బీ కాలనీ, కూకట్ పల్లి, భాగ్యనగర్ కాలనీ, ప్రగతి నగర్, పై ఏరియాల్లోని బల్క్ కనెక్షన్లకు సరఫరా ఉండదని అధికారులు తెలిపారు.
