రూటు మార్చిన టెర్రర్ గ్రూపులు.. కొత్త మెసేజింగ్ యాప్‌‌ల వినియోగం

రూటు మార్చిన టెర్రర్ గ్రూపులు.. కొత్త మెసేజింగ్ యాప్‌‌ల వినియోగం

న్యూఢిల్లీ: సమాచార గోప్యతకు ప్రాధాన్యం పెరుగుతోంది. వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో చాలా మంది యూజర్లు సిగ్నల్, టెలిగ్రామ్ వంటి మెసేజింగ్ యాప్స్ వైపు మరలుతున్నారు. టెర్రరిస్టులు కూడా వాట్సాప్, ఫేస్‌‌బుక్ మెసెంజర్స్‌‌కు గుడ్ బై చెబుతున్నారని సమాచారం. ఉగ్రవాదానికి అడ్డాగా మారిన పాకిస్థాన్‌లో టెర్రరిస్టులు వాట్సాప్, ఫేస్‌బుక్ మెసెంజర్స్‌‌ను వీడి కొత్త అప్లికేషన్స్‌‌ను వాడుతున్నట్లు తెలుస్తోంది.

వరల్డ్ వైడ్ వెబ్‌‌లో ఉన్న ఫ్రీ ఆన్‌లైన్ మెసేజింగ్ యాప్స్‌‌తోపాటు టర్కీకి చెందిన పలు అప్లికేషన్స్‌‌ను టెర్రరిస్టులు డౌన్‌‌లోడ్ చేసుకుంటున్నారని ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ (రాయిటర్స్) తెలిపింది. పాక్‌‌లోని ఉగ్రవాద గ్రూపులు, ఉగ్రముఠాలు కొత్తరకం మెసేజింగ్ యాప్స్‌ను వినియోగిస్తున్నాయని భారత సెక్యూరిటీ అధికారులు గుర్తించారు. భారత సెక్యూరిటీ దళాల నిఘా నుంచి తప్పించుకునేందుకు మూడు కొత్త యాప్‌‌లను టెర్రర్ గ్రూపులు వాడుతున్నట్లు తేలింది. ఈ కొత్త యాప్‌‌ల్లో ఒకటి అమెరికాకు చెందినదని, మరకొటి యూరప్‌‌దని.. మూడో కంపెనీ టర్కీకి చెందినదిగా గుర్తించారు.