
ప్రముఖ వ్యాపారవేత్తలు గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీలు దేశంలోని అగ్రనాయకులను కొనుగోలు చేయగలిగారు కాని తన సోదరుడిని ఎవరూ కొనలేరని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. తన సోదరుడు సత్యాన్ని నిలబెట్టాడని.. రాహుల్ గాంధీని చూసి ఆమె గర్వపడుతున్నట్లు చెప్పారు. భారత్ జోడో యాత్రను తిరిగి ప్రారంభించిన రాహుల్.. భారీ జనసందోహం మధ్య ఢిల్లీలోని హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు.
అనంతరం ఢిల్లీ నుంచి ఉత్తర్ ప్రదేశ్‌లోకి ఎంటర్ అయిన భారత్ జోడో యాత్రకు ప్రియాంక గాంధీ స్వాగతం పలికారు. ఈ ప్రాంతం ఒకప్పుడు భారీ రైతు నిరసనలకు వేదికైందని ప్రియాంక గాంధీ అన్నారు. యూపీలో భారత్ జోడో యాత్రను స్వాగతిస్తున్నందుకు తాను సంతోషంగా ఉన్నానని చెప్పారు. 3,000 కిలోమీటర్ల పాదయాత్ర తర్వాత కవాతు ఇక్కడకు చేరుకుందన్నారు. తన సోదరుడిని జోడో యాత్రకు వ్యతిరేకంగా ఎన్నో శక్తులను ప్రయోగించారని అయినా అతడు వెనకడుగు వేయలేదని ప్రియాంక చెప్పారు.