ఎత్తైన హౌసింగ్ సొసైటీపై నుంచి పడి ఐదేళ్ల బాలుడు మృతి

ఎత్తైన హౌసింగ్ సొసైటీపై నుంచి పడి ఐదేళ్ల బాలుడు మృతి

ఈరోజు (జూన్ 16) నోయిడాలోని హై-రైజ్ గ్రూప్ హౌసింగ్ సొసైటీ ఎనిమిదో అంతస్థులోని అపార్ట్‌మెంట్ బాల్కనీ నుంచి పడి ఐదేళ్ల బాలుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సెక్టార్ 113 పోలీస్ స్టేషన్ పరిధిలోని సెక్టార్ 78లోని హైడ్ పార్క్ సొసైటీ వద్ద తెల్లవారుజామున 5:45 గంటలకు ఈ ఘటన జరిగినట్టు చిన్నారి తల్లిదండ్రులు తెలిపారు. ఆ సమయంలో వారు నిద్రిస్తున్నట్టు వెల్లడించారు.

కొన్నిసార్లు పిల్లవాడు ఇతరుల కంటే ముందే నిద్రలేచి ఇంట్లో తిరుగుతుంటాడనిన, ఈ రోజు పిల్లవాడు కొంతమంది ప్లాంటర్లు ఉంచిన బాల్కనీకి వెళ్లి, దాని పైన బాల్కనీ గ్రిల్ నుంచి పడిపోయాడని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. చిన్నారిని 71వ సెక్టార్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించినా ప్రాణాలతో బయటపడలేదని వారు చెప్పారు. ఈ కేసులో తదుపరి చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు స్పష్టం చేశారు.