బండిపై తిరుగుతున్న పోకీమాన్.. ఏం చేయలేక నవ్వుతున్న పోలీసులు

బండిపై తిరుగుతున్న పోకీమాన్.. ఏం చేయలేక నవ్వుతున్న పోలీసులు

సెక్టార్ 132లో రోబ్జ్ హాస్పిటల్ సమీపంలో రైడ్ చేస్తున్నప్పుడు ఓ విచిత్రమైన హెల్మెట్ ధరించిన రైడర్‌ను చూసి నోయిడా పోలీసు అధికారులు ఆశ్చర్యపోయారు. ఒక వ్యక్తి పోకీమాన్ తరహా హెల్మెట్‌తో బైక్‌ను నడుపుతూ, బాటసారులను, పోలీసులను ఆకర్షించడాన్ని వారు గుర్తించారు. ఈ క్రమంలో విధుల్లో ఉన్న అధికారులు బైకర్‌తో సంభాషణలో దిగారు. అతని విచిత్రమైన హెల్మెట్‌ ధరించడానికి గల కారణాలను, వివరాలను అడిగి తెలుసుకున్నారు.

దీనికి సంబంధించి ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసు వ్యక్తి వాహనాన్ని ఆపి, రైడర్‌తో మాట్లాడడం ఇందులో చూడవచ్చు. అరే అద్భుతం... ఎవరూ హెల్మెట్ పెట్టుకోలేదు, గానీ ఎవరో ఇలా పెట్టుకున్నారని పోలీసు సిబ్బంది అన్నారు. అంతలోనే అతని వీపు మీద తడుముతూ, నవ్వుతూ, డ్యూటీలో ఉన్న పోలీసు రైడర్‌ని.. నువ్వు కుందేలువా? అడగ్గా.. ఆ వ్యక్తి కూడా అవునని తల ఊపుతూ మెల్లగా బదులిచ్చాడు. సరే, ఎలాగైనా పర్లేదు మీరు హెల్మెట్ పెట్టుకున్నారు. చాలా బాగుంది. చాలా బాగుంది అంటూ పోకీమాన్ తరహాలో హెల్మెట్‌ను ధరించిన వ్యక్తిని పోలీసు పొగడడం అందర్నీ ఆకర్షించింది.

ALSO READ : కంపెనీ మటాష్ : ఇదో దరిద్రమైన ఆటో.. ఎవరూ కొనొద్దు

ఈ సంఘటనను కొంతమంది యూజర్స్ ఎక్స్ లో పోస్ట్ చేయడంతో.. ఇది కాస్తా వైరల్ అయింది. ఈ పోస్ట్ కు చాలా మంది కామెంట్ చేశారు. ఈ పోస్ట్‌లు సోషల్‌మీడియా సైట్‌లో వేల సంఖ్యలో వ్యూస్‌తో వైరల్‌గా మారింది. ఎవరైనా అతనికి క్యారెట్ తినిపించండి అంటూ కొందరు చమత్కారంగా, మరికొందరు అతన్ని ప్రో రైడర్ అని పిలిచారు.