జీహెచ్ఎంసీ ఎన్నికలు: చిన్న వయసులోనే నామినేషన్

జీహెచ్ఎంసీ ఎన్నికలు: చిన్న వయసులోనే నామినేషన్

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. గ్రేటర్‌లో 150 కార్పొరేటర్ స్థానాలకు డిసెంబర్ 1న పోలింగ్ జరగనుంది. ఆ పోలింగ్‌కు సంబంధించి అభ్యర్థుల నామినేషన్ గడువు శుక్రవారంతో ముగిసింది. ఆ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులు శనివారం పరిశీలించి.. ఎన్నికల నియమాలు పాటించని అభ్యర్థుల నామినేషన్ పత్రాలను తిరస్కరించారు. అయితే నామినేషన్లను పరిశీలిస్తున్న అధికారులకు రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని శాస్త్రీపురం డివిజన్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన సయ్యద్ అబ్బాస్ నామినేషన్ కంటపడింది. దాన్ని పరిశీలించగా.. అబ్బాస్ వయసు 19 సంవత్సరాలుగా ఉంది. దాంతో అబ్బాస్ నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలలో పోటీచేయడానికి అర్హత వయసు 21 సంవత్సరాలు కావడమే దీనికి కారణమని అధికారులు తెలిపారు.

కాగా.. శాస్త్రీపురం డివిజన్ నుంచి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా రాజేష్ యాదవ్, బీజేపీ అభ్యర్థిగా బాబురావ్, కాంగ్రెస్ అభ్యర్థిగా తాజుద్దీన్, ఎంఐఎం అభ్యర్థిగా ముబిన్ బరిలో నిలిచారు.

For More News..

జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ కేటీఆర్‌ని కలిసిన యాంకర్ సుమ

లిస్టులో తల్లి పేరు.. బీ ఫారంలో భార్య పేరు

చేతిలో రూపాయి లేకుండా కార్పొరేటర్ బరిలోకి

ప్రచారానికి పోతే రూ.1000, బిర్యానీ ప్యాకెట్