మెదక్లో పోటాపోటీగా నామినేషన్లు

మెదక్లో పోటాపోటీగా నామినేషన్లు

మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వెలుగు: ఉమ్మడి జిల్లాలో పోటాపోటీగా నామినేషన్లు దాఖలవుతున్నాయి. సామాన్యులు, రైతులు సైతం నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. మెదక్​ జిల్లాలోని రెండు అసెంబ్లీ స్థానాలకు గురువారం 13 నామినేషన్లు  దాఖలయ్యాయి. మెదక్ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ రావు, బీజేపీ అభ్యర్థి పంజా విజయ్ కుమార్ రెండేసి సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. 

అలాగే ఎంసీపీఐ పార్టీ తరపున పుల్లయ్య వనం, భారత చైతన్య యువజన పార్టీ తరపున వనపర్తి రోహిత్, ఇండిపెండెంట్ అభ్యర్థి నాగరాజు నామినేషన్ వేశారు. నర్సాపూర్ అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి, బీజేపీ అభ్యర్థి మురళీ యాదవ్, ఇండియా ప్రజా బంధు పార్టీ తరపున జనపతి నర్సింలు, ఇండిపెండెంట్లుగా  గొర్రె ప్రవీణ్ రెడ్డి, చీకుర్టి లక్ష్మారెడ్డి, చీకుల పల్లి నవీన్ కుమార్, దొడ్ల నారాయణ రెడ్డి నామినేషన్ వేశారు. 

 సంగారెడ్డి జిల్లాలో.. 

జిల్లాలో ఐదు నియోజకవర్గాల వారీగా మొత్తం 63 నామినేషన్లు దాఖలయ్యాయి.  సంగారెడ్డి నుంచి చింతా ప్రభాకర్, (బీఆర్ఎస్), తూర్పు జయప్రకాశ్ రెడ్డి (కాంగ్రెస్), పులిమామిడి రాజు (బీజేపీ), రాజేశ్వరరావు దేశ్​పాండే (బీజేపీ), తోట నరసింహులు (ఇండియన్ ప్రజా బంధు ), దొడ్ల వెంకటేశం (తెలంగాణ ప్రజాశక్తి ), స్వతంత్ర అభ్యర్థులుగా జి. హరికాంత్ రెడ్డి, కోల్కూర్ ప్రతాప్, వి. వెంకటరెడ్డి, బంగారు కృష్ణ , ఎస్. జగదీశ్వర్, షర్కుల ఆంజనేయులు, కిరణ్ రాథోడ్, పోలీస్ రామచందర్, షేక్ జహూర్ రమేశ్​యాదవ్ నామినేషన్లను వేశారు. ఆందోల్ నియోజకవర్గం నుంచి దామోదర్​ రాజనర్సింహా (కాంగ్రెస్), పి. బాబు మోహన్ (బీజేపీ), ముప్పారం ప్రకాశ్​(బీఎస్పీ),  స్వతంత్ర అభ్యర్థులుగా సురేఖ, బ్యాగరీ రమేశ్, వి. డేవిడ్ నామినేషన్లు దాఖలు చేశారు. జహీరాబాద్ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి తరఫున చంద్రశేఖర్ భార్య ప్రమీల,  కె.మానిక్ రావు (బీఆర్ఎస్),  రాంచెందర్ రాజనర్సింహ(బీజేపీ), దశరత్ (ప్రజాశాంతి ), మర్రి దుర్గేశ్​(ఆర్ పీఐ), బాబు దుర్గయ్య (ఐపీబీపీ), బి. సిద్ధార్థ్ (వీఆరపీ), జంగం గోపి (బీఎస్పీ),  కె. నర్సింహులు (ఆధార్), స్వతంత్రులుగా ఆశప్ప, ఏర్పుల అశోక్ నామినేషన్లు దాఖలు చేశారు.  పటాన్ చెరు నుంచి గూడెం మహిపాల్ రెడ్డి (బీఆర్ఎస్), మహిపాల్ రెడ్డి తరఫున ఆయన సతీమణి గూడెం యాదమ్మ (బీఆర్ఎస్), తాటి నందీశ్వర్ గౌడ్ (బీజేపీ), నందీశ్వర్ గౌడ్ తరపున ఆయన సతీమణి టి. సంధ్య (బీజేపీ), కాటా శ్రీనివాస్ గౌడ్ (కాంగ్రెస్), కొత్త బాలాజీ (తెలంగాణ ప్రజా శక్తి), మల్లి ఖార్జున రావు (సీపీఎం), తంగాడాపల్లి పద్మరావు (ఇండియా ప్రజా బంధు), మెట్టు పద్మ (మనసురక్ష),  స్వతంత్ర అభ్యర్థులుగా కుంభ కాత్యాయని, మన్నే రాములు, ఖాదర్ మొయినుద్దీన్, పొనుగోటి అశోక్ నామినేషన్లు వేశారు. నారాయణఖేడ్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డి తరఫున మారేడు శ్రేయరెడ్డి, జనవాడే సంగప్ప (బీజేపీ), అలిగే జీవన్ కుమార్ (ధర్మ సమాజ), సురేశ్​ కుమార్ షెట్కర్ (కాంగ్రెస్), పట్లోళ్ల సంజీవరెడ్డి (కాంగ్రెస్), చౌహాన్ ఆకాశ్ ( జాతీయ జనసేన), అబ్దుల్ రహీం (జనతా కాంగ్రెస్), రమేశ్ (నవరంగ్ కాంగ్రెస్), ఆర్. ప్రకాశ్ (బహుజన ముక్తి), స్వతంత్ర అభ్యర్థులుగా సతీశ్, అంజాగౌడ్ అభెందా, ముదిరాజ్ వెంకటేశం,  బి. నాగేశ్వర్, పిట్లం నర్సారెడ్డి,  కోటగిరి మార్గాల సాయన్న నామినేషన్లు దాఖలు చేశారు.

సిద్దిపేట జిల్లాలో..

దుబ్బాక నుంచి మొత్తం  ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి. బీఆర్ఎస్ అభ్యర్తిగా కొత్త ప్రభాకర రెడ్డి రెండు సెట్లు,  బీఎస్పీ అభ్యర్తిగా సకలం మల్లయ్య రెండు సెట్లు, కాంగ్రెస్ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాసరెడ్డి,  ఆబాద్ పార్టీ అభ్యర్థిగా గొల్లపల్ విజయ్ కుమార్, ఇండియా ప్రజాబంధు పార్టీ అభ్యర్థిగా గుండుకాడి కరుణాకర్ నామినేషన్లు దాఖలు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర రెడ్డి వీల్ చైర్ లో వచ్చి నామినేషన్ దాఖలు చేయగా ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్​రావు పాల్గొన్నారు. సిద్దిపేట నుంచి  మొత్తం 17 నామినేషన్లు  దాఖలయ్యాయి. బీఆర్ఎస్ అభ్యర్థిగా తన్నీరు హరీశ్​ రావు , బీజేపీ అభ్యర్థిగా దూది శ్రీకాంత్ రెడ్డి, బీఎస్పీ అభ్యర్థిగా ఇద్దరు చక్రధర్ గౌడ్, పెదమాతిరి బాబు,  రిపబ్లిక్ పార్టీ ఆఫ్​ ఇండియా బొమ్మల ప్రవీణ్​ కుమార్, కాంగ్రెస్ అభ్యర్థిగా పూజల హరికృష్ణ, ఇండిపెండెంట్లుగా మామిండ్ల రాము , గువ్వల సంతోశ్​ కుమార్. ఏటీ ఆంజనేయులు, చాడ రజనీకర్ రెడ్డి , మోత్కు సాయి,   బర్రె మల్లయ్య, కొలిమి మల్లేశం, ధర్మాజీపేట ప్రతాప్ రెడ్డి, చేన్నోజు రాజు, ఎక్కలదేవి లింగం, పెదమాతిరి బాబు నామినేషన్లు దాఖలు చేశారు. 

మంత్రి హరీశ్ రావు  నాలుగు  సెట్ల నామినేషన్లు  దాఖలు చేశారు. హుస్నాబాద్ లో  ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. ఇండియా ప్రజాబంధు పార్టీ నుంచి బొంత నాగభూషణం,  పీపుల్స్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి సుంకరి వెంకటస్వామి, ఇండిపెండెంట్లుగా  అయిలేని మల్లికార్జునరెడ్డి, కామాద్రి మురళి, పచ్చిమట్ల రవీందర్, మంద నాగేశ్ నామినేషన్లు దాఖలు చేశారు.