- సిద్దిపేట మున్సిపాలిటీకి 18 కోట్ల నిధులు మంజూరు
- త్వరలో మంత్రి వివేక్ చేతుల మీదుగా శంకుస్థాపనలు
- కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పూజల హరికృష్ణ
సిద్దిపేట రూరల్, వెలుగు: 50 ఏండ్ల మామ అల్లుళ్ల పాలనలో సిద్దిపేటకు ఒక్క ఫ్యాక్టరీ తేకుండా, ఒక్కరికీ ఉపాధి కల్పించకుండా యువతను మోసం చేశారని సిద్దిపేట కాంగ్రెస్నియోజకవర్గ ఇన్చార్జి పూజల హరికృష్ణ ఆరోపించారు. సోమవారం పట్టణంలోని క్యాంప్ ఆఫీసులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. హరీశ్ తనకు తాను సీఎం స్థాయిలో ఊహించుకుంటున్నారని, సిద్దిపేట ప్రజలను గాలికి వదిలేసి ప్రచార ఆర్భాటాల్లో తిరుగుతున్నారని మండిపడ్డారు.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటుతుందని, రెండేండ్ల లో అమలు చేసిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. పదేళ్ల పాలనలో వారు చేసిన మోసాలకు బలైన ఆర్అండ్ఆర్ కాలనీ వాసులు, గజ్వేల్ లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన హరీశ్ రావుపై తిరగబడ్డారన్నారు. ప్రతీసారి కేసీఆర్ కు బదులు ఆయన రావడం చూసి గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆరా, హరీశ్ రావా అని నవ్వు కుంటున్నారన్నారు.
కొద్దీ రోజుల్లోనే ప్రతీ వార్డులో కాంగ్రెస్ కమిటీలు వేస్తామన్నారు. సిద్దిపేట మున్సిపల్ అభివృద్ధికి రూ.18 కోట్ల నిధులు మంత్రి వివేక్ చొరవతో మంజూరు చేయించుకున్నామని త్వరలో ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన లు చేస్తామన్నారు. కలీముద్దీన్, కౌన్సిలర్ పయ్యావుల ఎల్లం పూర్ణిమ యాదవ్, దాస ఆంజయ్య, మహిళ అధ్యక్షురాలు ముద్దం లక్ష్మిరెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూజల గోపికృష్ణ, అర్బన్ మండల అధ్యక్షుడు భిక్షపతి, వాహబ్, అజమాత్, సాయి ప్రతాప్, మల్లేశం, రజని, సన పాల్గొన్నారు.
