నిజామాబాద్ జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ పోరు

నిజామాబాద్ జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ పోరు
  • ఫస్ట్ విడతకు రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ 
  • ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేసిన యంత్రాంగం

నిజామాబాద్​/కామారెడ్డి, వెలుగు : పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో జరగనున్నాయి. ఫస్ట్ విడతలో ఎన్నికలకు గురువారం నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. నిజామాబాద్​ జిల్లాలో 545 గ్రామపంచాయతీలు ఉండగా, ఫస్ట్​ విడత బోధన్​ రెవెన్యూ డివిజన్​, సెకెండ్​ ఫేజ్​లో నిజామాబాద్​ డివిజన్, మూడో విడతలో ఆర్మూర్​ డివిజన్​లో ఎలక్షన్స్ జరగనున్నాయి. మొత్తం 5,053 పోలింగ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. కామారెడ్డి జిల్లాలో 532 పంచాయతీలు,  4,656 వార్డులు ఉన్నాయి. ఫస్ట్ విడతలో కామారెడ్డి డివిజన్​లోని 10 మండలాలు, సెకండ్ విడత ఎల్లారెడ్డి, బాన్సువాడ డివిజన్​లోని 7 మండలాలు, థర్డ్ విడత బాన్సువాడ డివిజన్​లోని  8 మండలాల్లో ఎన్నికలను నిర్వహిస్తారు. .

ఎన్నికల నిర్వహణకు ఉమ్మడి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేపట్టింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఫస్ట్​ విడత ఈ నెల 27 నామినేషన్లు ప్రారంభం కానుండగా, పోలింగ్​డిసెంబర్​11 జరగనున్నది. రెండో విడత ఈ నెల 30న ప్రారంభం కానుండగా, డిసెంబర్​ 14న పోలింగ్​నిర్వహించనున్నారు. మూడో విడత డిసెంబర్​3న నామినేషన్లు షురూ కానుండగా, డిసెంబర్​17న పోలింగ్​ జరగనున్నది.

నిజామాబాద్ జిల్లా ఫస్ట్ విడత

మండలం    జీపీలు    వార్డులు    పో.కే​ 

బోధన్    26    228    228

చందూర్    05     48    48

కోటగిరి    16    130    130

మోస్రా    05    52    52

పోతంగల్    20    166    166

రెంజల్    17    166    166

రుద్రూర్    11    100    100

సాలూరా    12    112    112

వర్ని     23    186    186

ఎడపల్లి    17    166    166

నవీపేట    32    288    299

రెండో విడతలో

మండలం    జీపీలు    వార్డులు    

పో.కే ధర్పల్లి    22    194    194

డిచ్​పల్లి    34    306     306

ఇందల్వాయి    23    198    198

మాక్లూర్    26     230    230

మొపాల్    21    192    192

నిజామాబాద్    19    172    172

సిరికొండ    30     264    264

జక్రాన్​పల్లి    21    204    204

మండలం    జీపీలు    వార్డులు    పో.కే​ 

ఆలూర్    11    114    114

ఆర్మూర్    14    142    142

బాల్కొండ    10    100    116

భీంగల్    27    244    244

డొంకేశ్వర్    13    118    118

కమ్మర్​పల్లి    14    138    138

మెండోరా    11    110    110

మోర్తాడ్    10    110    110

ముప్కాల్    07    74    74

నందిపేట    22    208    212

వేల్పూర్    18    180    180

ఎర్గెట్ల    08    82    82 

కామారెడ్డి జిల్లా   ఫస్ట్ విడత

మండలం    జీపీలు    వార్డుల    పో.కే

భిక్కనూరు    18    182    183

బీబీపేట    11    110    110

దోమకొండ    9    96    108

కామారెడ్డి    14    120    120

మాచారెడ్డి    25    196    196

పాల్వంచ    12    110    110

రాజంపేట    18    158    158

 రామారెడ్డి    18     166    166

సదాశివనగర్    24     214    214

తాడ్వాయి    18    168    168 

మొత్తం    167    1,520    1,533

రెండో విడత

మండలం        జీపీలు    వార్డుల     పో.కే​ 

లింగంపేట        41    342    342

నాగిరెడ్డిపేట        27    232    232

గాంధారి        45    366    366

ఎల్లారెడ్డి        31    246    246

మహమ్మద్​నగర్    13    112    112

నిజాంసాగర్        14    122    122

 పిట్లం        26    234    235 

మొత్తం        197    1,654    1,655

 3వ విడత

మండలం    జీపీలు    వార్డుల    పో.కే 

బిచ్​కుంద    23    204    204

డోంగ్లీ    13    116    116

జుక్కల్    30    270    270

మద్నూర్    21    194    194

పెద్దకొడప్​గల్24    198    198

బాన్సువాడ    25    222    222

బీర్కుర్    13    114    114

నస్రుల్లాబాద్    19    164    164 

మొత్తం    168    1,482     1,482