12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్ని నామినేషన్లంటే.?

12 ఎమ్మెల్సీ  స్థానాలకు ఎన్ని నామినేషన్లంటే.?

రాష్ట్రంలో  12 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఇవాళ్టితో నామినేషన్ గడువు ముగిసింది.రేపు( నవంబర్ 24) నామినేషన్లను పరిశీలించనున్నారు.  నవంబర్ 26 ఉపసంహరణకు గడువు. డిసెంబర్ 10 పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్ 14 కౌంటింగ్ జరగనుంది. ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, మెదక్ , నిజామాబాద్,  ఖమ్మం నుంచి ఒక్కో స్థానం.   కరీంనగర్ , మహబూబ్ నగర్, రంగారెడ్డి నుంచి రెండేసి ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరగనుంది.

ఏయే జిల్లాలో ఎన్ని నామినేషన్లంటే..

  • ఆదిలాబాద్ జిల్లా- 23 
  • వరంగల్ జిల్లా- 15
  • నల్గొండ జిల్లా- 13 
  • మెదక్ జిల్లా- 4 
  • నిజామాబాద్ - 2  
  • ఖమ్మం - 3
  • కరీంనగర్ - 22
  • మహబూబ్ - 11 
  • రంగారెడ్డి - 3