చిన్న పట్టణాల్లో ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ షాపింగ్ జోరు.. ఈ దీపావళి టైమ్‌‌‌‌‌‌‌‌లో 4.25 కోట్ల షిప్‌‌‌‌‌‌‌‌మెంట్లు

చిన్న పట్టణాల్లో ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ షాపింగ్ జోరు.. ఈ దీపావళి టైమ్‌‌‌‌‌‌‌‌లో 4.25 కోట్ల షిప్‌‌‌‌‌‌‌‌మెంట్లు
  • ఇందులో 50.7  శాతం టైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 3  సిటీల నుంచే: క్లిక్‌‌‌‌‌‌‌‌పోస్ట్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: ఈ దీపావళి  టైమ్‌‌‌‌‌‌‌‌లో నాన్‌‌‌‌‌‌‌‌ మెట్రో సిటీలలో  ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ షాపింగ్ ఊపందుకుంది.  లాజిస్టిక్స్‌‌‌‌‌‌‌‌ ఇంటెలిజెన్స్ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌ క్లిక్‌‌‌‌‌‌‌‌పోస్ట్‌‌‌‌‌‌‌‌ ప్రకారం, ఈ దీపావళిటైమ్‌‌‌‌లో  మొత్తం 4.25 కోట్ల షిప్‌‌‌‌‌‌‌‌మెంట్లు జరిగాయి. మొత్తం  ఈ-–కామర్స్ ఆర్డర్లలో 74.7శాతం టైర్ 2, 3 నగరాల నుంచే  ఉన్నాయి. ఇందులో ఒక్క టైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 3 నగరాల వాటానే  50.7శాతంగా ఉంది. దుర్గా పూజ, కర్వా చౌత్‌‌‌‌‌‌‌‌ వంటి పండుగలతో  ఫ్యాషన్, కాస్మెటిక్స్ కొనుగోళ్లు భారీగా పెరిగాయి. సగటు డెలివరీ సమయం 2.83 రోజులుగా నమోదైంది. 

సేమ్‌‌‌‌‌‌‌‌ డే హైపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకల్ డెలివరీ  ఏడాది లెక్కన 42శాతం పెరిగి మొత్తం ఆర్డర్లలో 8.7శాతానికి చేరింది. టైర్ 3 నగరాల్లో 52శాతం ఆర్డర్లు క్యాష్ ఆన్ డెలివరీ ద్వారా జరిగాయి.  అయితే ప్రీమియం కొనుగోళ్లలో ప్రీపెయిడ్ పేమెంట్లే ఎక్కువగా ఉన్నాయి.  ఆర్డర్ సగటు విలువ ఈ దీపావళిలో 32.5శాతం పెరిగి రూ.4,346కి చేరింది. 

‘‘ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ షాపింగ్‌‌‌‌‌‌‌‌లో  టైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 3 నగరాలు మెట్రోలను మించాయి. రిటైల్ రంగం వేగంగా మారుతోంది. వేగవంతమైన డెలివరీ, లోకలైజ్డ్ ఆఫర్లు, ఇంటెలిజెంట్ ఇన్వెంటరీలు కీలకం అవుతున్నాయి. మేము  నెలకు 5 కోట్ల షిప్‌‌‌‌‌‌‌‌మెంట్లను నిర్వహిస్తున్నాం”అని క్లిక్‌‌‌‌‌‌‌‌పోస్ట్‌‌‌‌‌‌‌‌ సీఈఓ నమన్ విజయ్  అన్నారు.