
గుళ్లలో ప్రసాదం అంటే కొబ్బరి ముక్కలు, పులిహోర వంటివి ఉంటాయి. కానీ, ఇక్కడ నూడిల్స్, చాప్ స్టూని కూడా ప్రసాదంగా ఇస్తారు! కోల్‌కతాలోని ‘చైనీస్ కాళీ’ టెంపుల్లో ఇస్తారు ఈ ప్రసాదాలు. నూడిల్స్ చైనా వాళ్ల ఫేమస్ ఫుడ్ ఐటమ్. ఇది ‘చైనీస్ కాళీ’ టెంపుల్ కాబట్టి, ఇక్కడ కూడా వాళ్లు తినే ఫుడ్‌నే ప్రసాదంగా పెడుతున్నారన్నమాట. కోల్‌కతాలోని తంగ్రా అనే ఏరియాలో ఉంది ఈ టెంపుల్. దీన్ని ‘చైనా టౌన్’ అని కూడా అంటారు. అక్కడి ప్రజల్లో టిబెటిన్, ఈస్ట్ ఏసియా కల్చర్ కనిపిస్తుంది. 20 ఏళ్ల క్రితం తంగ్రాలో బెంగాల్, చైనా ప్రజలు ఈ టెంపుల్ని కట్టారు. ఇక్కడ ఉన్న చెట్టు కింద అరవైయ్యేళ్ల క్రితం నుంచి పూజలు చేసేవాళ్లట. ఒకసారి, పదేళ్ల చైనా పిల్లాడికి హెల్త్ బాగోలేకపోతే, ఎన్ని ప్రయత్నాలు చేసినా, తగ్గలేదట. ఆ చెట్టు దగ్గరికి తీసుకెళ్లి కొన్ని రాత్రులు పూజలు చేస్తే.. ఆ పిల్లాడికి నయమైందనేది ఈ టెంపుల్ మహత్యం గురించి చెప్పుకునే కథల్లో ఒకటి.