
ముంబై: బాలీవుడ్ హీరోయిన్లు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి సమన్లు జారీ చేసింది. మనీ లాండరింగ్ కేసులో ఈ ఇద్దరు క్రేజీ హీరోయిన్లకు ఇప్పటికే ఒకసారి ఈడీ నోటీసులు ఇచ్చింది. సుకేష్ చంద్రశేఖర్‌కు సంబంధించి రూ. 200 కోట్ల హవాలా కేసు విషయంలో నోరా ఫతేహీకి సమన్లు జారీ చేస్తూ.. విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. కొన్ని రోజుల కింద సుకేష్‌కు చెందిన చెన్నైలోని బీచ్ బంగ్లాలో 2 కిలోల బంగారం, రూ. 85 లక్షల నగదుతోపాటు పలు లగ్జరీ కార్లు దొరికాయి. ఇదే కేసులో బాలీవుడ్ సెలబ్రిటీలను ఈడీ విచారిస్తోంది. కాగా, ఈడీ నోటీసు అందుకున్న నోరా విచారణ కోసం బయలుదేరింది. గురువారం ఆమెను విచారించనున్న ఈడీ.. అక్టోబర్ 15న జాక్వెలిన్‌ను ఇన్వెస్టిగేట్ చేయనుంది. కాగా, ఇప్పటికే ఈ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌ను ఈడీ ఒకసారి విచారించింది. ఈ మొత్తం కేసులో బాలీవుడ్ సెలబ్రిటీల పాత్ర కీలకమని ఈడీ ఆరోపిస్తోంది.